నల్లగొండ జిల్లా:ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఈసిఎల్ నుండి మరో 570 అదనపు బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవీఎం గోదాంలో బియు లను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైద్రాబాద్ ఈసిఎల్ నుండి కంటైనర్లో 57 ఐరన్ బాక్స్ లలో 570 బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని,గోదాంలో పోటీ అభ్యర్థులు,పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాంలో భద్రపరిచామని, తదుపరి చర్యలకై త్వరలో ఎఫ్.ఎల్.సి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ)ఏ.వెంకట్ రెడ్డి,ఆర్డీవో వీరబ్రహ్మచారి, డిఎం రాంపతి నాయక్, ఏఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం సిబ్బంది, తహశీల్దార్లు వివిధ పార్టీల పోటీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.