ఒకసారి స్టార్ డం వచ్చిందంటే చాలు చాలామంది తమను మించిన వారు లేరు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు.కానీ ఆ స్టార్ డం కి కారణం అయినా వారిని మాత్రం లెక్క చేయరు.
ఇలాంటి స్వభావం కలిగిన స్టార్స్ ఒక్క తెలుగు లో మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీ లలో కనిపిస్తుంది.మరి ముఖ్యంగా బాలీవుడ్( Bollywood ) లో అయితే చాల దారుణంగా ఉంది పరిస్థితి.
మీడియా తమ ముందు ఉంటే చాలు ఎక్కడ లేని పోజులు కొట్టడం అందరికి అలవాటై పోయింది.కానీ ఈ మిడిసి పాటు ఎన్ని రోజులు పని చేస్తుంది చెప్పండి.
ఒకటి రెండు రోజులు సక్సెస్ ఉన్నంత వరకే అని గుర్తు ఎరిగి మసలుకుంటే మంచిది.

ఇప్పుడు మనం తెలుసుకోబోతే రెండు సంఘటనలు ఇద్దరు హీరోయిన్స్ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి.అందులో ఒకరి నేషనల్ క్రష్ అయినా రష్మిక మందన్న( Rashmika Mandanna ) అయితే మరొక కాంట్రవర్సీ క్వీన్ షెర్లిన్ చోప్రా( Sherlyn Chopra ).ఈ ఇద్దరు భిన్నమైన ఇండస్ట్రీ లలో పని చేయడం మాత్రమే కాదు ఎంతో భిన్నమైన వ్యక్తిత్వం కూడా కలిగిన వారు.అది మీడియా ముందు ఈ ఇద్దరు ప్రవర్తించిన తీరును బట్టి యిట్టె అర్ధం చేసుకోవచ్చు.ఇటీవల ఎయిర్ పోర్ట్( Airport ) లో రష్మిక మందన్న నడుచుకుంటూ వస్తుండగా తన ముందు ఉన్న వ్యక్తి నుంచి ఎదో జారీ కింద పడింది.
అంది గమనించిన రష్మిక వస్తువు ఎంటో తెలియకుండానే అది తీసి ఆ వ్యక్తికి అందించబోయింది.తీరా చూస్తే అది టిష్యు పేపర్.అయినా కూడా ఆమె నవ్వుతు అతడికి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

ఇక ఇదే ఎయిర్ పోర్ట్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అయినా షెర్లిన్ చోప్రా కూడా వింతగా ప్రవర్తించింది.ఆమె అందాల ప్రదర్శనకు అడ్డుగా ఉన్న తన వొంటి పైన ఉన్న లెదర్ జాకెట్ ని తీసి కింద పడేసి వెళ్లి మరి ఫోటోలకు పోజులు ఇచ్చింది.అది చుసిన ఆమె అసిస్టెంట్ వెంటనే పరుగున వచ్చి ఆ జాకెట్ ను పట్టుకొని వెళ్ళిపోయాడు.
ఆమె జాకెట్ పడేసిన తీరు చూస్తే నిజంగా ఇంత అహంకారం ఏంటి అనే విధంగా అనిపించింది.మీడియా ముందు హుందాగా వ్యవహరిస్తే అందరికి మంచిది అని ఈ రెండు సంఘటనలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.