ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన ప్రకటన అంతర్జాతీయ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.ఆ వెంటనే భారత్ , కెనడా దౌత్య సంబంధాలు సైతం ఉద్రిక్తంగా మారాయి.
ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలో తన వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ తాత్కాలికంగా మూసివేసింది.
ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మరోవైపు మెజారిటీ కెనడియన్లు( Canadians) సైతం భారత్‌తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నట్లు ఓ పోల్ తెలిపింది.
దాదాపు 57 శాతం మంది కెనడియన్లు దేశంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి , దౌత్యపరమైన చర్చలలో కెనడా ప్రభుత్వం పాల్గొనాలని సీటీవీ న్యూస్ కోసం నిర్వహించిన నానోస్ రీసెర్చ్ పోల్ వెల్లడించింది.సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ఒకరు ట్రూడో ఆరోపణలపై మరింత దర్యాప్తు చేయాలని కోరగా.
ప్రది 10 మందిలో ఒకరు కెనడా సహనంతో వుండాలని, ఇకపై ఎలాంటి చర్యలకు దిగకూడదని ఆకాంక్షించారు.
![Telugu Canadaprime, Canadians, Delhi, Hardeepsingh, India Canada, Khalistan, Mel Telugu Canadaprime, Canadians, Delhi, Hardeepsingh, India Canada, Khalistan, Mel](https://telugustop.com/wp-content/uploads/2023/10/More-than-half-of-Canadians-want-Ottawa-to-decrease-tensions-with-Delhi-over-Nijjar-killing-detailsd.jpg)
భారత్‌తో దౌత్యపరమైన చర్చలను కొనసాగించాలని 50.3 శాతం మంది బ్రిటీష్ కొలంబియా వాసులు, ( British Colombia ) 65 శాతం మంది క్యూబెక్ ప్రావిన్స్( Quebec Province ) వాసులు కోరుకున్నారు.అలాగే నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం వుందంటూ ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలను తాము విశ్వసిస్తున్నామని 47 శాతం మంది, కొంతమేర అనుమానించవచ్చని 27 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ప్రతి ఐదుగురిలో ఒకరు ట్రూడో వ్యాఖ్యలను తాము నమ్మడం లేదని సర్వే తెలిపింది.
![Telugu Canadaprime, Canadians, Delhi, Hardeepsingh, India Canada, Khalistan, Mel Telugu Canadaprime, Canadians, Delhi, Hardeepsingh, India Canada, Khalistan, Mel](https://telugustop.com/wp-content/uploads/2023/10/More-than-half-of-Canadians-want-Ottawa-to-decrease-tensions-with-Delhi-over-Nijjar-killing-detailsa.jpg)
మరోవైపు.ప్రస్తుతం నెలకొన్న దౌత్యపరమైన వివాదాన్ని పరిష్కరించడానికి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ( Melanie Joly ) గత నెలలో వాషింగ్టన్‌లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌తో( S Jaishankar ) రహస్య సమావేశం నిర్వహించారని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది.జోలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ… సంభాషణలు రహస్యంగా వున్నప్పుడు దౌత్యం ఎప్పుడు మెరుగ్గా వుంటుందని వ్యాఖ్యానించారు.
భారతదేశానికి వచ్చినప్పుడు కూడా తాను అదే విధానాన్ని కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.