టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అరెస్టుకు, తెలంగాణకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలా అన్న మంత్రి కేటీఆర్ చంద్రబాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ఏంటన్నారు.ఆందోళనలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని తనకు లోకేశ్ ఫోన్ చేశారన్నారు.
శాంతిభద్రతల సమస్య వస్తుందని ఎవరికీ అనుమతి ఇవ్వమని చెప్పానన్నారు.కావాలంటే రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోండని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ అనేది రెండు పార్టీల వ్యవహారం అని చెప్పారు.తనకు లోకేశ్, జగన్, పవన్ మిత్రులేనన్న కేటీఆర్ ఏపీలో ఎవరితో శత్రుత్వం లేదని పేర్కొన్నారు.
ఏపీ ప్రజలు ఇక్కడ బాగానే ఉన్నారన్న మంత్రి కేటీఆర్ చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారని వెల్లడించారు.