సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సాధారణంగా జరుగుతుంది.ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండు భాషల్లో రీమేక్ అయిందంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అయితే ఒక సినిమా మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయింది.వెంకటేష్ ( Venkatesh )నటించిన పవిత్ర బంధం సినిమా( Pavitra Bandham ) ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
వెంకటేష్, సౌందర్య ( Soundarya )కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.విదేశాల్లో పెరిగిన యువకుడికి ప్రేమ, లైఫ్ గొప్పదనం గురించి చెప్పిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.కాంట్రాక్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది.రిస్కీ సబ్జెక్ట్ అయినప్పటికీ వెంకటేశ్, సౌందర్య ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
ఈ సినిమాలో ఒక సీన్ లో భాగంగా వెంకటేశ్ సౌందర్య కాళ్లపై పడతారు.ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.బెంగాళీ, తమిళ్, బంగ్లాదేశ్, హిందీ, ఒరియా, కన్నడ భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు బెస్ట్ మూవీగా నంది అవార్డ్ దక్కింది.
సౌందర్య, ఎస్పీ బాలు కూడా ఈ సినిమాకు నంది అవార్డులను అందుకున్నారు.ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
పవిత్ర బంధం సినిమా ఈ జనరేషన్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.వెంకటేశ్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో నటిస్తున్నారు.
కొత్త తరహా కథాంశంతో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.