నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఇకపోతే బాలయ్య బాబుతో కలిసి నటించిన వారు ఆయనతో కలిసి తిరిగిన వారు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని చెబుతూ ఉంటారు.
కానీ ఆయనను దూరం నుండి చూసినవారు ఎప్పుడూ కోపంతో ఉంటాడు మండిపడుతూ ఉంటాడు.కోపం వస్తే కొడతాడు అంటూ అపార్థం చేసుకుంటూ ఉంటారు.
మంచి వాళ్లకు మంచివాడు కోపం వస్తే మాత్రం ఎదుటి వ్యక్తి ఎవరా అని కూడా చూడడు మన బాలయ్య బాబు.అలా ఇప్పటికే గతంలో చాలా సందర్భాలలో తన అభిమానుల విషయంలో చాలా సార్లు బాలకృష్ణ కోపంగా ప్రవర్తించిన సంగతి మనకు తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అంతేకాకుండా ఆయన చేత చెంపదెబ్బలు కూడా తిన్నారు.ఈ విషయంలో బాలకృష్ణ విమర్షలు ఎదుర్కొన్నా ఆయన చేత దెబ్బలు తినడం కూడా లక్కే అంటూ ఫ్యాన్స్ మురిసిపోతుంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో బాలకృష్ణ ఒక దర్శకుడిపై సీరియస్ అయినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.స్టార్ డైరెక్టర్ బాబి( Star Director Bobby ) పై బాలయ్య సీరియస్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాబీ బాలయ్యతో ఒక మూవీ చేస్తున్నాడు.
బాబి బాలకృష్ణతో NBK 109 సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.అయితే ఈ సినిమాకి సంబంధించి బాబి స్వయంగా తానే కొన్ని డైలాగులు రాసి తన దగ్గర ఉండే టీం ని బాలకృష్ణ దగ్గరికి పంపించి ఆ డైలాగులు ఎలా ఉన్నాయో చూడమని చెప్పారట.
అయితే ఆ డైలాగులు చూసి బాలకృష్ణకి చాలా కోపం రావడంతో తన దగ్గరికి వచ్చిన టీం ని కోపంతో తిట్టి పంపించేసారట.ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియదు కాని సోషల్ మీడియా( Social Media )లో మాత్రం తెగ వైరల్ అవుతోంది.