మణిపూర్ ( Manipur )లో జరిగిన అల్లర్లు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో చాలామంది అమాయకులు బలైపోయారు.
దీంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం కొన్ని నెలలు పాటు ఇంటర్నెట్ సదుపాయాలను ఆఫ్ చేయటం జరిగింది.మణిపూర్ లో జరిగిన అల్లర్ లలో ఇద్దరు స్త్రీలను బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించి.
అత్యాచారం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.ఈ వీడియో పట్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.
ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో ఇంకా నిరసనలు.ఒకరిపై మరొకరి దాడులు చేసే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో అక్కడి బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.విషయంలోకి వెళ్తే “కుకీ పీపుల్స్ అలయన్స్” ( Kookie People’s Alliance )పార్టీ రాష్ట్రంలో కొనసాగుతున్న వివాదం కారణంగా బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
మణిపూర్ అసెంబ్లీలో ఈ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వివాదాల కారణంగానే తీసుకున్నట్లు “కుకీ పీపుల్స్ అలయన్స్” పార్టీ ప్రకటన చేయడం జరిగింది.
ఈ పరిణామంతో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చినట్లయింది.