సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ( Sruthi Haasan ) అలాంటి వ్యాధితో బాధపడుతుంది అంటూ ప్రస్తుతం ఫిలింనగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.ఇక ఈ న్యూస్ తెలిసి శృతిహాసన్ అభిమానులు పాపం అలాంటి అరుదైన వ్యాధి మా హీరోయిన్ కే రావాలా అంటూ కామెంట్ పెడుతున్నారు.
మరి శృతిహాసన్ కి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
గబ్బర్ సింగ్( Gabbarsingh ) , బలుపు, రేసుగుర్రం, క్రాక్, వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి,ఎవడు, శ్రీమంతుడు, సెవెంత్ సెన్స్ వంటి ఎన్నో సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శృతిహాసన్.ఇక మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న పాన్ ఇండియా మూవీ సలార్ ( Salaar ) సినిమాలో కూడా ప్రభాస్ (Prabhas) సరసన నటిస్తోంది.అయితే అలాంటి శృతిహాసన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట.
అదేంటంటే.ఆమెకు ఒత్తిడి ఎక్కువవడంతో తెలియకుండానే ఆవేశానికి లోనై కోప్పడుతుందట.అంతేకాదు తన కోపం తన కంట్రోల్లో ఉండకుండా చిన్న చిన్న విషయాలకే అరిచేస్తూ గోల గోల చేస్తుందట.ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఎందుకిలా చేస్తున్నాను అంటూ తనలో తానే బాధపడుతుందట.
ఇక ఆ కోపం లో నుండి బయట పడాలని, ఒత్తిడి ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిసారి ఏదైనా పని చేసేటప్పుడు మ్యూజిక్ వింటూ స్ట్రెస్ ని తగ్గించుకుంటుందట.అలాగే వీలైనంతవరకు సంతోషంగా గడపడానికే ట్రై చేస్తుందట.
అయితే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఏది ఏమైనాప్పటికీ శృతిహాసన్ ( Sruthi Haasan ) కి ఉన్న వ్యాధి నిజమో లేదో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట్లో మాత్రం శృతిహాసన్ అలాంటి వ్యాధితో బాధపడుతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు.