జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.శనివారం సాయంత్రం పెంటపాడు మండలం రామచంద్రాపురంలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.చంద్రబాబుని పవన్ ఎప్పుడైతే ఆశ్రయించాడో.
అప్పుడే అతని విలువ తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు.అతని విలువ అప్పుడే జీరో అయిపోయిందని విమర్శించారు.
ఎక్కడికొచ్చి ఎవరినైతే విమర్శిస్తున్నావో దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలు కౌంటర్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.పవన్ కళ్యాణ్ ఇప్పుడు విమర్శిస్తున్న ధోరణి మార్చుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు.
పవన్ తన తీరు మార్చుకోకపోతే ప్రజలు మరోసారి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఆదివారం నుండి పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి విజయ యాత్రలో పాల్గొనబోతున్నారు.ఆదివారం ఏలూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.మొదటి దశ వారాహి విజయ యాత్రకి ప్రజల నుండి భారీ ఎత్తున స్పందన రావడంతో.రెండో దశ యాత్ర విజయవంతం చేయటానికి జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఏలూరు నగరంలో భారీ ఎత్తున హోర్డింగ్ లు, కటౌట్లు మరియు జనసేన జెండాలు కట్టడం జరిగింది.