రోబోలతో కాల్‌సెంటర్… ఐడియా అదుర్స్ కదూ.అయితే అది అంత సులభం కాదు.
ఏమాత్రం తేడా వచ్చినా కస్టమర్లు తిట్టి పడేస్తారు.క్లయింట్ కంపెనీలను అయితే సంతోష పెట్టడం కష్టమే.
అయితే ఇలాంటి సమస్యకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్‌లో(Artificial Intelligence) పరిష్కారం కనిపెట్టింది రాశి గుప్తా( Rashi Gupta ).అవును, ఆమె ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ చేసింది.బయోమెట్రీలో పీహెచ్‌డీ అందుకుంది.కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది.ఆ తర్వాత కార్పొరేట్ కొలువులో కొలువుదీరింది… కానీ అవి ఆమెని పెద్దగా సంతృప్తిపరచలేదు.దీంతో స్టార్టప్ వైపు అడుగులు వేసింది.‘రేజో.ఏఐ’ పేరుతో కాల్‌సెంటర్ నిర్వహణకు కృత్రిమ మేధను జోడించింది.

ఇంకేముంది కంటే చేస్తే ఆమె ఈ కాల్‌సెంటర్( Call center ) విజయవంతంగా రన్ చేస్తోంది.కాలర్ ఏ భాషలో మాట్లాడుతున్నారన్నది కనిపెట్టి, అదే భాషలో స్పందించే సాంకేతికతను రూపొందించింది.సాధారణంగా ఏ ఐదో పదో ప్రశ్నలకు ముందస్తుగా రికార్డు చేసిన సమాధానాలు ఇస్తుంటాయి కాల్‌సెంటర్ రోబోలు.కానీ రాశి గుప్తా దాదాపుగా మనుషులతో సమానంగా సంభాషించగల సాంకేతికతను సిద్ధం చేసింది.
కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఓ చోటుకు తీసుకొచ్చి.లోతుగా విశ్లేషించే పనీ ఈ రోబోలదే.
దీంతో మారుతి సహా అనేకానేక దిగ్గజాలు ఆమె క్లయింట్‌గా మారాయి.

ఇక ఆమె పనితీరు నచ్చిన డెల్హీవరీ, మాడ్యులర్ క్యాపిటల్ తదితర సంస్థలు కూడా రేజోలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం.ఈ సందర్భంగా ఆమె జర్నీని ఓ మీడియా వేదికగా ఆమె చెప్పుకొచ్చింది.ఈ క్రమంలో ఆమె ‘మనుషులతో మాట్లాడే రోబోలు చాలానే ఉన్నాయి.నేను పనిచేస్తున్నది మనుషులను అర్థం చేసుకునే రోబోలతో’ అని చెప్పుకొచ్చింది రాశి.ఐడియా అయితే మస్తుంది కదూ.ఎందుకుండదు? కానీ మనుషులతో ఇక్కడ పనిలేకుండా పోయింది.దాంతో అనేకమంది నిరుద్యోగులుగా మారక తప్పదు అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.ఈ AI వల్ల భావితరాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటామని వాపోతున్నారు.







