రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండపల్లి డబుల్ బెడ్ రూమ్ ల వద్ద తేదీ సోమవారం గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బంది నరేందర్, సంపత్ తో కలసి ఉదయం11 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిగా ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించగ అతన్ని పట్టుకొని తనిఖీ చేయగా అతని వద్ద 230 గ్రాముల గంజాయి దొరకగా అట్టి వ్యక్తిని పట్టుకొని విచారించగా తన పేరు వడిచర్ల జాన్ ప్రతాప్ రెడ్డి తండ్రి శివ రెడ్డి నాంపల్లి గ్రామం వేములవాడ మండలం అని,
జాన్ ప్రతాప్ రెడ్డి గంజాయి తగడమే కాకుండా అమ్ముతాడాని, ఇతని మీద వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అట్టి వ్యక్తిని అరెస్ట్ చేసి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి పోయింపనైనది అని సి.
ఐ ఉపేందర్ తెలిపారు.యువతకు పోలీస్ వారి విజ్ఞప్తి గంజాయి లాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తాగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు.