“మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది” సినిమాలో హీరో శ్రీకాంత్ తన భార్య రాశిని లవర్ వడ్డే నవీన్‌తో పంపించేస్తాడు.ఆ సినిమా చూసి చాలామంది ఇదేం చెత్త సినిమా అనుకుంటూ తిట్టుకున్నారు.
సినిమాలో చూపిస్తేనే సామాన్య ప్రజలు ఈ తీరును ఒప్పుకోలేదు.అయితే తాజాగా రియల్ లైఫ్‌లోనే ఇలాంటి ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని ఒక గ్రామానికి చెందిన భర్త తన భార్యను ప్రియుడితో కలిపి వారిని లేచిపోమని ప్రోత్సహించాడు.
వివరాల్లోకి వెళితే.మహారాష్ట్ర( Maharashtra )లోని ఓ గ్రామంలో సనోజ్ అనే వ్యక్తికి ప్రియాంక అనే మహిళతో వివాహమైంది.కొన్ని రోజుల తర్వాత ప్రియాంక సంతోషంగా లేదని సనోజ్ గమనించాడు.
ఆ తర్వాత ఆమె తమ గ్రామానికి చెందిన జితేంద్ర అనే మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది.ప్రియాంక( Priyanka ), జితేంద్ర 10 సంవత్సరాల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
అయితే వారి సామాజిక నేపథ్యంలో విభేదాల కారణంగా వారు వివాహం చేసుకోలేకపోయారు.
జితేంద్రతో కలిసి ఉండలేకపోవడం పట్ల ప్రియాంక తీవ్ర అసంతృప్తితో ఉన్నందున అతనితో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంది.అయితే గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్( Police station )కు తరలించారు.కొంత సమయం తర్వాత పోలీసులు ప్రియాంక భర్త అయిన సనోజ్‌ను అతని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఏమి జరిగిందో వివరించారు.
ఈ సంగతి తెలిసి కోప్పడాల్సింది పోయి సనోజ్ జితేంద్రతో ప్రియాంకకు ఉన్న సంబంధానికి తన ఫుల్ సపోర్ట్ ప్రకటించాడు.వాళ్ళు పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నా తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టంగా తెలిపాడు.
దీంతో ఆశ్చర్య పోవడం అందరివంతయ్యింది.