సాధారణంగానే గర్భిణీ మహిళలు( Pregnant women ) ప్రయాణం చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది.కరోనా వచ్చిన తర్వాత ప్రయాణం అంటే ప్రమాదం అనంత భయం మొదలైంది.
కానీ ఇప్పుడు కాస్త పరిస్థితులు మారాయి.కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కరోనా గురించి భయం పోయింది.
ఇప్పుడు గర్భిణీ మహిళలు ప్రయాణం చేసేందుకు రూల్స్ కూడా మారిపోయాయి.అయినప్పటికీ ఇంట్లో వారు గర్భిణీలను బయటకి పంపించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు.
ఎందుకంటే గర్భస్రావం అవుతుందేమోనని భయపడతారు.అందుకే బయటకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.డెలివరీ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.ఎందుకంటే ఏ క్షణమైనా డెలివరీ అవుతుంది కాబట్టి అటువంటి సమయంలో ప్రయాణం అసలు మంచిది కాదు.
మొదటి నెలలో కొంతమందికి వికారం,వాంతులు, నీరసం, మార్నింగ్ సీక్ నేస్ ఉంటుంది.అలాంటి సందర్భంలో ఒక్కోసారి గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే నాలుగు నుంచి ఆరు నెలల సమయంలో ప్రయాణాలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
దూరప్రయాణాలు వెళ్లాల్సి వస్తే చాలామంది కారు ను ఎంచుకుంటారు.కానీ ఒక విధంగా అది మంచి ఆలోచన కానప్పటికీ దానివల్ల కొద్దిగా ప్రయోజనం ఉంటుంది.మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవచ్చు.
కారులో వెళుతున్నప్పుడు పాదాలు, వేలు కదిలించడానికి అనువుగా ఉంటుంది.ఇక విమానంలో ( Flights )ప్రయాణించడం గర్భిణీ స్త్రీకి హానికరం కానప్పటికీ విమాన సంస్థ ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణం చేయాలి.
28 నుంచి 34 వారాల గర్భధారణ మధ్య ఫిట్ టు ఫ్లై సర్టిఫికెట్ ఇస్తారు.నాలుగు గంటలకంటే ఎక్కువ దూరం ప్రయాణం అయితే థ్రాంబోసిస్ వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.గర్భధారణ సమయంలో ప్రయాణం చేసేటప్పుడు బయట దొరికే నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకోసం గర్భిణీ మహిళలకు కావాల్సినవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే ఎంతో మంచిది.
అలాగే గర్భిణీ మహిళలు ఎప్పుడు ప్రయాణం చేయాలి అనుకున్నా వారి మెడికల్ రిపోర్ట్( Medical report ) లను తమ వద్ద ఉంచుకోవాలి.ఎందుకంటే ఏదైనా అత్యవసరం అయినప్పుడు వైద్యం చేసే వైద్యులు పాత రిపోర్ట్ చూస్తే సరైన వైద్యం అందిస్తారు.