పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ”ప్రాజెక్ట్ కే”( Project K ) ఒకటి.నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్స్ తో( crazy posters ) పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచేశారు.
అలాగే ఒక వైపు షూట్ పూర్తి చేసుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలం లోనే పూర్తి చేస్తున్నారు.ఇలా నాగ్ అశ్విన్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు రావాలని కష్ట పడుతున్నారు.
మిగిలిన బ్యాలెన్స్ షూట్ కూడా మరికొన్ని వారాల్లో పూర్తి చేసి అక్టోబర్ తర్వాత నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్.వచ్చే ఏడాది జనవరి లోనే ఈ సినిమా రిలీజ్ ఉండడంతో అప్పటికే హైప్ క్రియేట్ అయ్యేలా చేసేందుకు కూడా కసరత్తులు చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, బిగ్ బి( Deepika Padukone, Big B ) వంటి స్టార్స్ భాగం అయిన విషయం విదితమే.ఇక నిన్నటి నుండి ఈ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ ఉందని దాని కోసం నాగ్ అశ్విన్ కమల్ హాసన్ ను ఒప్పించారని తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి ఈ రోల్ కోసం ప్రభాస్ ( Prabhas )కంటే కమల్ భారీ పారితోషికం అంటే ఏకంగా 150 కోట్లు అడిగారని టాక్ బయటకు వచ్చింది.కానీ ఇందులో ఎంత వాస్తవం అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది./br>
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇవన్నీ రూమర్స్ అని తెలుస్తుంది.కమల్ హాసన్ ఒకవేళ ఈ సినిమాలో ఉన్న కూడా అంత డిమాండ్ చేసే అవకాశం లేదని అంటున్నారు.దీంతో ఈ రూమర్స్ అన్ని అవాస్తవం అని తేలిపోయింది.ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండగా.ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.