ఉల్లి సాగుకు ( Cultivation of onion )తీవ్ర నష్టం కలిగించే తెగులలో ఊదా మచ్చ తెగులు( Spot rot ) కీలక పాత్ర పోషిస్తాయి.శీతాకాలంలో ఈ తెగులు పంటను ఆశిస్తాయి.
ఈ తెగులు ముఖ్యంగా స్టెంఫిలియం( Stemphyllium ) ఎండు తెగులతో కలిసి పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ తెగులు సోకిన మొక్కలను ఎలా గుర్తించాలి.
ఎలా నివారించాలి అనే విషయాలు చూద్దాం.ఈ తెగులు సోకిన ఉల్లి కాడలపై చిన్నచిన్న నొక్కుకుపోయినట్టు తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.
ఈ మచ్చలు గోధుమ లేదా ఊదా రంగులోకి మారుతాయి.తర్వాత ఈ తెగుల వ్యాప్తి పెరిగి కాడలు వాలిపోయి చనిపోతాయి.
ఉల్లిగడ్డ లోపల ఉండే మధ్య భాగంలో మొత్తం కుళ్ళి మెత్తగా కనిపిస్తుంది.ఈ తెగులను సకాలంలో గుర్తించి తెగుల బారిన మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేసేయాలి.
ఉల్లి సాగును నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలలో సాగు చేయాలి.ఉప్పు, చౌడు, క్షారత్వం( Salt, iron, alkalinity ) ఉండే నేలలు ఉల్లి సాగుకు పనికిరావు.వివిధ రకాల తెగులను తట్టుకునే మేలు రకమైన విత్తనాలను ఎంచుకొని సాగు చేయాలి.పొలంలో కలుపు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.ఎరువుల విషయానికి వస్తే ఎక్కువగా సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యం ఇవ్వాలి.ఎకరం నేలలో 10 టన్నుల పశువుల ఎరువు, 60 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్ ఎరువులను అందించాలి.
ఉల్లి సాగు నాటిన రెండు నెలల వ్యవధిలో నాలుగు నుంచి ఐదు నీటి తడులు అందించాలి.ఉల్లిగడ్డ ఊరే దశలో ఆరు రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.
ఊదా మచ్చ తెగులను వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గుర్తించి నివారణ కోసం ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల మాంకోజెబ్ కలిపి పిచికారి చేయాలి.ఒకవేళ ఫలితం కనిపించకపోతే ఒక లీటరు నీటిలో 2.5 గ్రాముల కోరోథలోనిల్ కలిపి పంటకు పిచికారి చేయాలి.