ఈ మధ్య చిన్న సెలెబ్రెటీలతో పాటు స్టార్ సెలబ్రెటీలు( Celebrities ) డబ్బుల కోసం బాగా దిగజారిపోతున్నారు.ఇప్పటికే పలు రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా మళ్లీ డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
అది ఏ పనైనా సరే డబ్బులు వస్తే చాలు అని అనుకుంటున్నారు.ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ ల ద్వారా ఆన్లైన్ గేమ్ ( Online game )లను ప్రమోట్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అంతేకాకుండా హెల్త్ ని పాడు చేసే ప్రోడక్ట్ ల గురించి కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు.అయితే తాజాగా యాంకర్ సుమ కూడా డబ్బుల కోసం ఇటువంటి పని చేయటంతో జనాలు ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్( Tollywood ) బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి తెలియని వారెవ్వరూ లేరు.
ఇక ఈమె యాంకరింగ్ చేసే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే.తన మాటలతో అందరిని ఆకట్టుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
కానీ అంత క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది.బుల్లితెరపై మాత్రం స్టార్ గా నిలిచింది.
ఆమె వేసే పంచ్ లు మాత్రం ఓ రేంజ్ లో పేలుతాయి.సుమ( Suma ) సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇప్పటివరకు తన యాంకరింగ్ విషయంలో కానీ, తన మాటల్లో గాని ఎటువంటి నెగటివ్ ను దరికి రానీయకుండా ముందుకు సాగుతుంది.
ఒక సినిమా ఈవెంట్ లోనే కాదు సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో కూడా సుమ చేసే రచ్చ బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ మధ్య సుమ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించగా అందులో తనకు సంబంధించిన కామెడీ వీడియోలను, పలు ఎంటర్టైన్మెంట్( Comedy videos, lots of entertainment ) ప్రోగ్రాంలను అభిమానులను తెగ పంచుకుంటుంది.అంతేకాకుండా తను ఇంట్లో చేసే అల్లరి పనులను కూడా తెగ షేర్ చేస్తుంది.
కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా అన్ని ఛానల్ లో సుమ ఆల్ రౌండర్ గా నిలిచింది.తనకున్న ఎనర్జీ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వకుండా ఉండలేరు.
ఈ మధ్య ఇన్ స్టా లో కూడా తెగ రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.మొత్తానికి షోస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బాగా సంపాదించుకుంటూ పోతుంది సుమ.అయితే తాజాగా ఆమె తన భర్తతో కలిసి ఫుడ్ ప్రొడక్ట్స్ ను, పచ్చళ్లను ప్రమోట్ చేసింది.
ఇక దానికి సంబంధించిన వీడియోలో పచ్చల గురించి తెగ పొగిడేసింది.అయితే ఆ వీడియో చూసి జనాలు సుమపై బాగా ఫైర్ అవుతున్నారు.కారణం ఏంటంటే ఆ పచ్చళ్ల కు సోషల్ మీడియాలలో చాలామంది వ్యతిరేకత చూపిస్తున్నారు.
సుమ చెబుతున్న ప్రొడక్ట్స్ ఏవి మంచివి కాదని.డెలివరీ డేట్ చేసే లోపు పాడైపోతున్నాయని.
ప్యాకింగ్ కూడా సరిగా ఉండట్లేదు అని.కొందరికి డబ్బులు తీసుకొని కూడా ఐటమ్స్ పంపించలేదు అని ఇలా అ పచ్చల గురించి రకరకాలుగా కంప్లైంట్ చేస్తూ కనిపించారు.దీంతో సుమపై బాగా ఏకీపారేస్తున్నారు.డబ్బుల కోసం ఇటువంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఎలా ప్రమోట్ చేస్తున్నావు అంటూ ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు.