ఇళయరాజా ను తిట్టే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా? 

ఇళయరాజా( Ilaiyaraaja ) సమకూర్చిన ఎలాంటి పాటైనా కూడా ఆయన అనుమతి లేకుండా ఏ స్టేజీపై పాడినా కూడా ఆ ఇళయరాజా టీం నుంచి నోటీసులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.గతంలో ఆయన చాలామందికి ఇలాగే నోటీసులు పంపించారు బాలసుబ్రమణ్యం, సింగర్ చిత్ర, ఎస్పీ చరణ్ తో పాటు ఒక టీవీ ఛానల్ కి కూడా ఆయన నోటీసులు పంపించారు.

 Facts About Ilayaraja Notices To Singers ,ilaiyaraaja, Sp Balu ,manjummel Boys-TeluguStop.com

అయితే ఈ విషయంపై ఒక తమిళ మీడియా ఛానల్ నాయగన్ వంటి సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయగా ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు.ఆయన ఇళయరాజా తో నాలుగు సినిమాలకు సంగీతం చేయించుకున్నారట.

Telugu Ilaiyaraaja, Kalyanam, Kollywood, Manjummel, Sp Balu, Tollywood-Movie

ఆ నిర్మాత వర్షన్ ఏంటి అంటే ఎస్పీ బాలు( SP Balu ) మరియు ఇళయరాజా 50 ఏళ్లుగా స్నేహితులు.గతంలో కూడా వారికి ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చాయి.కానీ అవి మీడియా వరకు చేరలేదు వారి మధ్య అవి సాల్వ్ చేసుకోబడ్డాయి.ఇప్పుడు మళ్లీ ఎలాంటి సమస్య ఇళయరాజా ద్వారా వచ్చినా కూడా అవి వారి మధ్య ముగిసిపోతాయి.

దానికి సమాధానాలు వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు.మీడియా హడావిడి అంతకన్నా అవసరం లేదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు.

తనకు డబ్బులు ఇవ్వాలని ఇళయరాజా ఏనాడు ఎస్పీ బాలు ఇంటిముందు టెంటు వేసుకొని కూర్చోలేదు కదా అంటూ నిర్మాత చెప్పారు అడగగా డబ్బులు సినిమా పెట్టిన నిర్మాతకు మాత్రమే చెందాలి కదా అని అంటే, ఒక సినిమా తీస్తే అందులో నటించే నటులకు అవార్డులు కూడా ఇస్తారు.మరి అవార్డులు లెక్క ప్రకారం నిర్మాతలు ఇవ్వాలి కానీ వారికి ఎందుకు ఇవ్వాలి అని సమాధానం వచ్చింది.

Telugu Ilaiyaraaja, Kalyanam, Kollywood, Manjummel, Sp Balu, Tollywood-Movie

అయితే మరో ప్రశ్నకు గాను ఇళయరాజా పాడిన పాటలను నువ్వు ఎవరు పాడుకోకూడదా? ఆయనకు మాత్రమే హక్కులు ఉంటాయా అని అడిగితే దానికి సైతం నిర్మాత తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.కొంతమంది ఉదాహరణకు ఎస్పీ బాలునే తీసుకుందాం ఆయన డబ్బులు తీసుకొని స్టేజిపై ఆర్గనైజర్స్ ఇచ్చిన అమౌంట్ ఒప్పుకొని పాట పాడుతున్నారు.ఆయన ఏమి చారిటీ చేయడం లేదు కదా? పైగా ఆర్గనైజర్స్ కూడా ఏమీ చారిటీ చేయడం లేదు.అలాంటప్పుడు వారిపై కేసు వేస్తే లేదా నోటీసులు ఇస్తే తప్పేంటి అనేది నిర్మాత వర్షన్.

ఇక మంజుమల్ బాయ్స్ వి( Manjummel Boys )షయానికొస్తే వారు సైతం పర్మిషన్ నిర్మాత నుంచి తీసుకున్న ఇళయరాజా టీం నుంచి మాత్రం తీసుకోలేదట.ఈ కాపీరైట్స్ వ్యవహారాలు పేమెంట్ సంగతి ఇళయరాజా దగ్గర ఉండే కళ్యాణం అనే వ్యక్తి చూసుకుంటారు ఆయన మాత్రమే ఇవన్నీ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.

పైగా ఇళయరాజా ఎంతో పేదరికంలో పుట్టి ఈరోజు వరకు ఎంతో డబ్బు సంపాదించారు ఆయనకు డబ్బు విలువ తెలుసు అలాగే మార్కెట్ విలువ తెలుసు.అందుకే ఆయన దేనిని ఫ్రీగా ఇవ్వాలి అనుకోవడం లేదు.

ఇందులో ఎంతో కొంత న్యాయం ఉంది అని కొంతమంది వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube