మనం సినిమా( Manam ).మూడు తరాల నటులను ఒకే ఫ్రేమ్ లో చూపిస్తూ ఎంతో కష్టమైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు పెడితే సూపర్ హిట్ చేశారు.
నిజానికి ఈ సినిమా నిర్మాణం జరిగేటప్పుడు నాగార్జునకు ఇది ఓ మోస్తారు విజయం సాధిస్తే చాలు అని మాత్రమే అనుకున్నారట కానీ ఇప్పుడు ఇది 10 ఏళ్లు పూర్తి చేసుకుని ఒక క్లాసిక్ సినిమాగా ఉంటుందని ఆరోజు నాగార్జున( Nagarjuna ) ఊహించలేదు.అంతలా ప్రేక్షకుల హృదయాలను ఈ సినిమా ఆకర్షించింది.
చాలా విషయాల్లో ఈ సినిమా ఎంతో బెస్ట్ అని అనిపించింది ఎందుకంటే సినిమా తీసిన విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏమాత్రం ఒక ప్రేమ కొద్దిగా మారినా కూడా స్క్రీన్ ప్లే మొత్తం కూడా తారుమారయ్యే అవకాశం ఉంది కథ.మొత్తం ఒక కన్ఫ్యూషన్ లో పడే అవకాశం కూడా ఉంటుంది.సినిమా చూసే ప్రేక్షకుడికి అసలు అర్థం కాదు.అంత సబ్జెక్టు టిపికల్ గా ఉండడం వల్లే ఈ సినిమా విజయవంతం అయింది.

మూడు తరాల నటులను ఒక సినిమాలో చూపించడం అనేది అప్పట్లో పెద్ద సంచలనం.ఇది కూడా ఒకే కుటుంబంలోని నటులను చూపిస్తూ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా అద్భుతం.అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao )ని ఈ సినిమా కోసం ఒప్పించినప్పుడే దర్శకుడు సగం విజయం సాధించేశాడు.ఆయన నాగచైతన్య( Naga Chaitanya )తో సైతం పోటీపడి నటించాలని అనుకోవడం నిజంగా ఎంతో గ్రేట్ అని చెప్పాల్సిందే.
ఓకే ఫ్రేమ్లో ఓ తాత మనవళ్లు తండ్రి కనిపించి తాత మనవడిగా తండ్రి కొడుకుగా మనవడు తాతగా ఇలా కంప్లికెటెడ్ స్క్రిప్ట్ తో సినిమా గా రావడం అది విజయం సాధించడం ఇప్పట్లో జరిగే పనైతే కాదు.

అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.అప్పటికే 10 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఉన్నాడు.పైగా అదే ఎనర్జీ అదే ఉత్సాహం కనిపించింది ఆయన నటనలో.
సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే ఒక సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ పోషించిన అక్కినేని ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు శ్రీ రామదాసు వంటి చిన్న నిధివిగల పాత్రలు చేస్తూ వచ్చారు కానీ మనం సినిమాలోని ఆయన మళ్ళి పూర్తిస్థాయి పాత్ర పోషించారు.ఇక ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంతో చక్కగా కుదిరింది అనుప్ రూబెన్స్ సంగీతం సూపర్ డూపర్ హిట్.
ఇక ఫ్లాష్ బ్యాక్ లో శ్రియతో నాగార్జున సన్నివేశాలు అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయి అవి ప్రతి ఇంట్లో జరిగినట్టుగా తమ తల్లిదండ్రులే వీరు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి.కచ్చితంగా మనం ఒక మాస్టర్ పీస్.
విక్రమ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన బహుమతి.