డార్క్ అండర్ ఆర్మ్స్.అమ్మాయిల్లో చాలా మంది కామన్‌గా ఫేస్ చేసే చర్మ సమస్యల్లో ఇదీ ఒకటి.
డెడ్ స్కిన్ సెల్స్, గాలి ఆడక పోవడం, అధిక చెమటలు, మాయిశ్చరైజర్‌ను ఎవైడ్ చేయడం, స్కిన్ కేర్ లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా మారిపోతుంటాయి.దాంతో స్లీవ్ లెస్ టాప్స్, డ్రెస్సులను ధరించాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ లోని డార్క్ నెస్‌ను వదిలించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.ఎంతో ఖర్చు పెట్టి క్రీములు కొనుగోలు చేస్తుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే టీ పొడితో డార్క్ అండర్ ఆర్మ్స్ కు బై బై చెప్పొచ్చని మీకు తెలుసా? అవును, అదెలాగో లేట్ చేయకుండా ఇప్పుడు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల టీ పొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ కలబంద జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్‌లో అప్లై చేసి సర్కిలర్ మోషన్‌లో బాగా మసాజ్ చేసుకోవాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చూసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే డార్క్ అండర్ ఆర్మ్స్ వైట్‌గా, బ్రైట్‌గా మారతాయి.
అలాగే ఒక బౌల్ లో రెండు స్పూన్ల టీ పొడి, ఒక స్పూన్ పెసర పిండి, ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ మరియు వాటర్ వేసుకుని కలుపు కోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి.స్మూత్‌గా స్క్రబ్ చేసుకోవాలి.
ఆ తర్వాత కాసేపు డ్రై అవ్వనిచ్చి అప్పుడు కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్‌గా ఇలా చేసినా అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారతాయి.
ఇక గిన్నెలో రెండు స్పూన్ల టీ పొడి, అర స్పూన్ కస్తూరి పసుపు, ఒక స్పూన్ తేనె మరియు మూడు స్పూన్ల పాలు వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్‌లో పూసి కాస్త ఆరనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.