బాల్య వివాహానికి నో చెప్పి పట్టా సాధించిన ఐశ్వర్య.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

కాలం ఎంత మారుతున్నా టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ పల్లెటూళ్లలో పరిస్థితులు పెద్దగా మారలేదు.ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే ఇతర ప్రాంతాలకు పంపించడానికి చాలామంది తల్లీదండ్రులు అస్సలు ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.

 Aishwarya Inspirational Success Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే కర్ణాటక( Karnataka )కు చెందిన ఐశ్వర్య అనే యువతి సక్సెస్ స్టోరీ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Telugu Aishwarya, Inspirational, Karnataka, Masters Degree, Zealand, Story-Inspi

ఐశ్వర్య( Aishwarya, ) సక్సెస్ స్టోరీకి వావ్ అనాల్సిందేనంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఎన్నో ఆటంకాలను, అవరోధాలను అధిగమించి ఐశ్వర్య తన సక్సెస్ స్టోరీతో ఆకట్టుకుంటున్నారు.కర్ణాటక రాష్ట్రంలోని చిన్న ఊరికి చెందిన ఐశ్వర్య ఆ ఊరి నుంచి విదేశాల్లో మొట్టమొదటి మాస్టర్స్ డిగ్రీ( Masters degree ) చేసిన అమ్మాయిగా నిలిచారు.

Telugu Aishwarya, Inspirational, Karnataka, Masters Degree, Zealand, Story-Inspi

పట్టు పట్టి పట్టా సాధించిన ఐశ్వర్య చాలా సంవత్సరాల క్రితం బాల్య వివాహానికి నో చెప్పారు.బిజినెస్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ, డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ లో డిప్లొమా పూర్తి చేసిన ఐశ్వర్య 21 సంవత్సరాల వయస్సులోనే ప్రముఖ పీఆర్ సంస్థలో జాబ్ సాధించారు.ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు న్యూజిలాండ్ లో మాస్టర్స్ చేశారు.కమ్యూనికేషన్ తెలియదు అనే స్థాయి నుంచి మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ సాధించే స్థాయికి ఆమె ఎదిగారు.

ఐశ్వర్య సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిదాయకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.ఐశ్వర్యలా కష్టపడితే కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

ఐశ్వర్య ఒక్కో మెట్టు పైకి ఎదిగి తన కలలను నెరవేర్చుకున్నారు.ఎన్ని విమర్శలు ఎదురైనా ఆ విమర్శలను పట్టించుకోకుండా ఆమె ముందడుగులు వేశారు.

ఐశ్వర్య ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube