వాళ్ళు వెళ్తే నాకేంటి సంబంధం.. రేవ్ పార్టీ పై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

మంచు లక్ష్మి( Manchu Lakshmi ) , అజయ్‌( Ajay ) , వేదిక, ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి‘ ( Yakshini ).ఈ వెబ్ సిరీస్ జూన్ 14వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది.

 Manchu Lakshmi React On Benguluru Rave Party , Manchu Lakshmi, Rave Party, Ben-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ లాంఛ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మీ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ ( Benguluru rave party ) సంచలనం రేపుతున్న సంగతి మనకు తెలిసిందే .అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మికి ఈ రేవ్ పార్టీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరులు తనని రేవ్ పార్టీ గురించి ప్రశ్నలు వేశారు.ఈ ప్రశ్నలకు ఈమె సమాధానం చెబుతూ ప్రస్తుతం రేవ్ పార్టీ గురించి మాట్లాడటానికి ఇది సరైన సందర్భం కాదని తెలిపారు.అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదని నేను మాత్రం ఇలా సిరీస్ గురించి ఆలోచిస్తున్నానని తెలిపారు.నేను నటించిన సిరీస్ గురించి మాట్లాడదాం.ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం.ఆ వ్యక్తులు.

వాళ్ల ప్రాబ్లమ్‌ అంతే అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి రేవ్ పార్టీ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బెంగళూరు( Benguluru )లోని ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి నటి హేమ( Actress Hema ) కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.ఈమెతో పాటు మరి కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube