ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తాన్ నిధులు .. నాకు సంబంధం లేదు : ఎన్ఆర్ఐ ఇక్బాల్ సింగ్ క్లారిటీ

ఆమ్ ఆద్మీ పార్టీకి( AAP ) ఖలిస్తానీ నిధులు అందాయంటూ అప్పట్లో వార్తలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు ఫ్రాన్స్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఇక్బాల్ సింగ్ భట్టి.

 France Nri Iqbal Singh Bhatti Denies Involvement In Aaps Pro-khalistan Funding D-TeluguStop.com

( Iqbal Singh Bhatti ) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కార్యాలయంలో తాను అలాంటి పాత్ర పోషించలేదని ఆయన స్పష్టం చేశారు.ఆప్ నిధుల ఎపిసోడ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇక్బాల్ సింగ్ .ఆరోరా డాన్ అనే ఔట్‌ఫిట్ నడుపుతున్నాడు.ఇది ఫ్రాన్స్‌లో( France ) మరణించిన భారతీయులకు అంత్యక్రియలు చేయడంలో సహాయపడుతుంది.తాజా భారత పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో అంత్యక్రియలు ముగిసిన 8 మంది భారతీయుల చితాభస్మాన్ని కూడా ఆయన తీసుకెళ్తున్నాడు.

తాను సామాజిక కార్యకర్తనని, ప్రధాని నరేంద్రమోడీ( PM Narendra Modi ) ఫ్రాన్స్‌కు వచ్చిన ప్రతిసారీ ఆయనను కలిసినట్లు తెలిపే పత్రాలను కూడా సమర్పించారు.కొన్ని వారాల క్రితం తాను బీజేపీకి చెందిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ సహకారంతో ప్యారిస్‌లో మోడీకి అనుకూలంగా కారు ర్యాలీని కూడా నిర్వహించినట్లు సింగ్ చెప్పారు.

మే 5న లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేంద్ర హోం కార్యదర్శికి ఒక లేఖ పంపారు.

Telugu Aap, Arvind Kejriwal, Aurore Dawn, Davinderpal, France Nri, Gurpatwantsin

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై ఆప్ అధినేత , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .( Delhi CM Aravind Kejriwal ) భట్టికి జనవరి 2014లో రాసిన మరో లేఖను ప్రస్తావించారు.1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్ విచారణ జరిపి దశాబ్ధాలుగా జైళ్లలో మగ్గుతున్న దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్( Davinder Pal Singh Bhullar ) సహా సిక్కులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భట్టి గతంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేశారు.కేజ్రీవాల్ లేఖలో ఆప్ ప్రభుత్వం ఇప్పటికే భుల్లార్‌ను విడుదల చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేసినట్లుగా పేర్కొన్నారు.సిట్ ఏర్పాటు సహా ఇతర అంశాలపై సానుభూతితో , సమయానుకూలంగా పనిచేస్తామని అందులో సీఎం అన్నారు.

Telugu Aap, Arvind Kejriwal, Aurore Dawn, Davinderpal, France Nri, Gurpatwantsin

కాగా.ఢిల్లీ లిక్కర్ స్కాంలో( Delhi Liquor Scam ) అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సమయంలో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ. ఆప్‌కు ఖలిస్తాన్ అనుకూల గ్రూపుల నుంచి దాదాపు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చినట్లు ఆయన ఆరోపించారు.2014-2022 సంవత్సరాల కాలంలో ఆప్ ఈ నిధులు తీసుకున్నట్లుగా పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందుకు ప్రతిఫలంగా ఖలిస్తాన్ నేత భుల్లార్‌ను విడుదల చేయడానికి కేజ్రీవాల్ అంగీకరించారని గురుపత్వంత్ ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube