కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ( Cannes Film Festival )లో ఇండియన్ నటి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.ఈ ఫెస్టివల్ లో అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.
అయితే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ నటిగా అనసూయ సేన్ గుప్తా( Anasuya Sengupta ) చరిత్ర సృష్టించారు.అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డును భావిస్తారు.
కాగా 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్ లో జరుగుతున్న సంగతి తెలసిందే.‘అన్ సర్టెయిన్ రిగార్డ్ ’ విభాగంలో అనసూయ అవార్డును సొంతం చేసుకున్నారు.
బల్గేరియన్ చిత్ర నిర్మాతగా… కాన్ స్టాంటిన్ బోజనోవ్ డైరెక్షన్ లో వచ్చిన ‘షేమ్ లెస్( The Shameless )’ మూవీలో ఆమె పాత్రకు ఈ అవార్డు లభించింది.ఢిల్లీలో పోలీసులను కత్తితో పొడిచి చంపి వేశ్యాగృహం నుంచి పారిపోయిన అమ్మాయి జీవిత ప్రయాణమే కథగా ఈ సినిమా తెరకెక్కింది.