సార్వత్రిక ఎన్నికల( General Elections) ఐదు విడతల పోలింగ్ శాతాలు విడుదల అయ్యాయి.ఈ మేరకు పోలింగ్ శాతాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
మొదటి విడతలో 66.41 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) పేర్కొంది.రెండో విడతలో 66.71 శాతం పోలింగ్ నమోదు కాగా.మూడో విడతలో 65.68 శాతం పోలింగ్ నమోదు అయిందని సీఈసీ తెలిపింది.అదేవిధంగా నాలుగో విడతలో 69.16 శాతం పోలింగ్ నమోదు కాగా.ఐదో విడతలో సుమారు 62.20 శాతం పోలింగ్ నమోదు అయిందని సీఈసీ వెల్లడించింది.