డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలిస్తే హత్యలు జరుగుతాయి .. కాంగ్రెస్ సభ్యురాలి సంచలన వ్యాఖ్యలు

అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) డెమొక్రాట్ పార్టీ నుంచి .

 Us Representative Ayanna Pressley Warns Of ‘murdering Spree’ If Donald Trump-TeluguStop.com

రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు మరోసారి బరిలో నిలిచారు.వీరిద్దరూ అధికారికంగా ఆయా పార్టీల నామినేషన్స్‌ను దక్కించుకుని ఎన్నికల్లో తలపడనున్నారు.

ఎన్నికల సరళి, ఏ పార్టీ గెలుస్తుందోనని చెబుతూ ఓపీనియన్ పోల్స్, అనేక ముదస్తు సర్వేలు వెలువడుతున్నాయి.ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు డెమొక్రాటిక్ పార్టీ నేత, యూఎస్ ప్రతినిధుల సభ సభ్యురాలు అయన్న ప్రెస్లీ .ట్రంప్ కనుక రెండోసారి గెలిస్తే హత్యలు జరుగుతాయని ఆమె వ్యాఖ్యానించారు.బుధవారం మసాచుసెట్స్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రెస్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Telugu Ayanna Pressley, Doj, Donald Trump, Joe Biden, Project, Republican, Sched

స్క్వాడ్’లో భాగమైన ప్రెస్లీ ఇటీవల ప్రాజెక్ట్ 2025గా పిలుస్తున్న రిపబ్లికన్ ప్రాజెక్ట్‌ను విమర్శించారు.ఉరిశిక్ష అమలుపై దాని వైఖరి కారణంగా ఇది ముగింపుకు ఒక సాధనంగా పేర్కొన్నారు.ప్రెస్లీ ఈ అభ్యాసాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారిలో ఒకరు , ఇది మరిన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ హత్యలకు దారితీయవచ్చని ఆమె ఆరోపించారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ హత్యాకాండ సాగిపోతుందని ప్రెస్లీ( Ayanna Pressley ) మండిపడ్డాడు.

ఇది మరణశిక్షను అమలు చేయడానికి దూకుడుపై ఉండటంతో పాటు దాని వినియోగాన్ని మరింత మందికి విస్తరింపజేస్తుందని ప్రెస్లీ ఆరోపించారు.

Telugu Ayanna Pressley, Doj, Donald Trump, Joe Biden, Project, Republican, Sched

ట్రంప్( Donald Trump ) అధికారంలోకి రావడానికి ఈ ప్రాజెక్ట్ ఒక బ్లూప్రింట్‌గా పరిగణించబడుతుందని.కార్యనిర్వాహక అధికారాన్ని కేంద్రీకరించడం, వివిధ ఏజెన్సీలలో బడ్జెట్‌లను తగ్గించడం, అధ్యక్షుడి విచక్షణాధికారంతో అనుభవజ్ఞులైన అధికారులను తొలగించవచ్చని ప్రెస్లీ అభిప్రాయపడ్డారు.షెడ్యూల్ ఎఫ్( Schedule F ) అని పిలిచే కార్యనిర్వాహక ఉత్తర్వు దీనిని సులభతరం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ షెడ్యూల్ వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాలను గుర్తించాల్సిందిగా అయన్న విజ్ఞప్తి చేశారు.ఇది విస్త్రతమైన హోల్‌సేల్ పాలసీ హింసని అమలు చేయడానికి తీవ్రవాదులకు ఒక సాధనమని ఆమె పేర్కొన్నారు.

ఇది ప్రభుత్వ సంస్థల పనితీరుకు అంతరాయం కలిగించడంతో పాటు అమెరికన్ల జీవితాలపై ప్రభావం చూపవచ్చని అయన్న ప్రెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube