ఉదయం లేవగానే అలసటగా ఉంటుందా...అయితే ఈ ఆహారాలు మీ కోసమే

రాత్రి లేటుగా నిద్రపోయిన మరియు పగటి సమయంలో ఎక్కువగా పని చేసిన ఉదయం లేవగానే కాస్త అలసటగా అన్పిస్తుంది.అలాగే ఈ అలసటకు పోషకార లోపం కూడా కారణం కావచ్చు.

 Fight Morning Fatigue Best Foods-TeluguStop.com

ఈ విధమైన అలసట ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే ఈ సమస్య నుండి సక్సెస్ గా బయట పడవచ్చు.ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం .

ఓట్ మీల్

ఓట్ మీల్ లో పీచు పదార్ధం అధికంగా ఉండుట వలన జీర్ణక్రియ మెరుగుపడి ఆకలిని పెంచుతుంది.దీనిలో ఉండే విటమిన్స్,మినరల్స్ అలసట లేకుండా చేస్తాయి.

 Fight Morning Fatigue Best Foods-ఉదయం లేవగానే అలసటగా ఉంటుందా#8230;అయితే ఈ ఆహారాలు మీ కోసమే-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్

వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన మానసిక ఆరోగ్యాన్ని పెంచి ఏకాగ్రత బాగా ఉండేలా చేస్తాయి.అలాగే వీటిలో ఉండే పీచుపదార్ధం మరియు యాంటీఆక్సిడెంట్లు కండరాల నొప్పులను మరియు ఆందోళన తగ్గిస్తాయి.

పాల ఉత్పత్తులు

పాలలో ఉండే లాక్టోజ్ అలసటను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.పాలలోని ఉండే ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం మెదడులో సెరోటోనిన్ స్రావంను ప్రేరేపిస్తుంది.దాంతో అలసట అనేది తగ్గుతుంది.అయితే పాల ఉత్పత్తులు పడని వారు వాటి జోలికి వేళలకుండా ఉంటేనే మంచిది.

పప్పుధాన్యాలు

ఆరోగ్యకరమైన ఆహారాల్లో పప్పుధాన్యాలు ఒకటి.పప్పుధాన్యాలు, రక్తలేమిని తగ్గించే, ఇనుము మరియు ప్రొటీన్లను ఎక్కువగా కలిగి ఉంటాయి.వీటిలో మీ శక్తి స్థాయిలను పెంచి, మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచే కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి.కాబట్టి అలసటను సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube