తారక్( Jr ntr ) గురించి ప్రతి విషయం తెరిచిన పుస్తకమే.నందమూరి ఇంట పుట్టిన వారసుడు.
చిన్నతనంలోనే కుటుంబం నుంచి ప్రేమలు అనుబంధాలు దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.తల్లిని మిగతా వారంతా దూషిస్తున్న తనను ఎవరూ దగ్గర తీయకుండా కూడా వారి నుంచే ప్రేమను ఆశించాడు.
తాను ఎప్పటికైనా నందమూరి ఇంటి వంశానికి వారసుడిని చెప్పుకునే ప్రయత్నం చేశాడు.ఎంతో పట్టుదలతో శ్రమించి ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తండ్రి తప్ప మరొక సపోర్ట్ సిస్టం లేకుండా ఈ రోజు స్టార్ హీరో అయ్యాడు.
కొన్ని కోట్ల మంది అభిమానులు ఈరోజు మా ఎన్టీఆర్ మనవడు మా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకునే స్థాయికి తనను తాను మలుచుకున్నాడు.

అయితే కుటుంబంలో ఎప్పుడూ శాలిని మరియు తారక్ పట్ల చిన్నచూపు అయితే ఉన్న విషయం అందరికీ తెలిసిందే.మరి వారి విషయంలో తారక్ ఎందుకు తనను చిన్నప్పుడు చూసిన విధానానికి కోపం లేదు అని అంటే తారక్ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడాడు తన బంధువులపై తనకున్న అభిమానాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశారు.అది నా కుటుంబం నేను నందమూరి ఇంటి బిడ్డను నా తండ్రి నందమూరి హరికృష్ణ( Nandamuri Harikrishna ) మిగతా వారంతా తండ్రి తోబుట్టువులు.
కొన్ని కారణాలవల్ల మేము వారికి ఇబ్బందిని కలిగించవచ్చు కానీ మాకు వారంటే ఎంతో ప్రేమ భార్య కూడా ఇప్పుడు నేను ఎంతో ప్రేమ పాత్రుడినే.

ఎవరికి ఎలాంటి అభిప్రాయం నాపై ఉన్నా కూడా నాకు వారందరిపై మంచి అభిప్రాయమే ఉంది.వారిని నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.వారిలో నాలో ఒకటే రక్తం ఉంది.
నన్ను ఇప్పుడు వారి బిడ్డగా వారందరూ అంగీకరించారు.నన్ను నందమూరి బిడ్డగా ఈ ప్రపంచమే అంగీకరించింది.
వీటి ముందు ఒకప్పుడు వాళ్లకు నాపై ఉన్న కోపాన్ని చూపించి ఎవరిని సాధించాలని అనుకోవడం లేదు.నా తోబుట్టువులు కూడా నన్ను ఎంతో ప్రేమ గానే చూస్తున్నారు.
శత్రువుని కూడా ప్రేమించాలి అనేది నా తాత నేర్పిన సూత్రం నేను దానిని పాటిస్తాను అని నందమూరి బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబం పై ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరిస్తున్నాడు.