ప్రస్తుతం ఐపీఎల్ ( IPL ) సీజన్ తుది దశకు చేరుకుంది ఎక్కడ చూసినా ఆన్లైన్లో అలాగే సోషల్ మీడియాలో ఐపిఎల్ వార్తలు తప్ప మరొక సంచలనం లేదు రోజురోజుకీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతూ ఈ పొట్టి ఫార్మాట్ ప్రేక్షకుల ఆదరణను బాగానే దక్కించుకుంది.అయితే మన తెలుగు జట్టు విషయానికొస్తే సన్రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది.
ఈ జట్టుకి సీఈఓ గా కావ్య మారన్( Kavya Maran ) ఉండగా ఆమె తమిళ ప్రముఖ మీడియా టైకున్ కలానిది మారన్ కుమార్తె కావడం విశేషం.రోజు రోజుకి ప్రేక్షకులలో సైతం ఐపీఎల్ ఆసక్తి బాగా పెరుగుతుంది వందల కోట్ల బిజినెస్ కూడా దీని ద్వారా జరగుతుంది.

ఇక ఒక కావ్య మారన్ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు ఆమె కేవలం కళానిధి కుమార్తె గానే ఈ ప్రపంచానికి పరిచయం.ఇక ఆమె వయసు 32 ఏళ్లు కాగా ప్రస్తుతం సింగిల్ గానే ఉంది.అయితే చాలా ఏళ్లుగా కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.మరి నిజంగా కావ్య ఎంత మందితో డేటింగ్ చేసింది అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.
ముఖ్యంగా ఎల్లప్పుడూ వార్తల్లో ఉండే అనిరుద్ రవిచంద్రన్ తో( Anirudh Ravichandran ) ఎక్కువగా మీడియాకి కనిపించడం తో కావ్య మరియు అనిరుధ్ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.చివరికి తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరూ చెప్పినట్టుగానే వీరు కూడా చెప్పారు.

ఇక ఐపీఎల్ 2023 లో రిషబ్ పంత్ తో( Rishabh Pant ) ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉంది అనే సిగ్నల్ ఇచ్చినప్పటికీ అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్ లో ఉన్నాడు అందుకే వీరు మధ్య డేటింగ్ రూమర్స్ కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.ప్రస్తుతం ఐపీఎల్ 2024 నడుస్తోంది.దీనిలో తెలుగు టీం నుంచి అభిషేక్ శర్మ( Abhishek Sharma ) అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు 23 ఏళ్ల ఈ క్రికెటర్ తో కూడా చాలా క్లోజ్ కావ్య మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.కానీ వీరి మధ్య దాదాపు పది ఏళ్ళ తేడా ఉంది.
ఇది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అవుతుందా లేక మరింత దూరం వెళుతుందా అనేది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.