తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి( Maheswar Reddy ) బహిరంగ లేఖ రాశారు.ధాన్యం కొనుగోలులో చోటు చేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ( CBI Investigation ) జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో అవకతవకలకు సంబంధించిన ఆధారాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖతో పాటు పంపిస్తానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.ధాన్యం కొనుగోళ్లపై చిత్తశుద్ధి ఉంటే జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని తెలిపారు.
ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కేసులకు భయపడే వారు కాదని ఆయన స్పష్టం చేశారు.