తెలంగాణలో 2024 -25 స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది.ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్(Schools Academic Calendar ) ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మేరకు జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.అంతకుముందు జూన్ ఒకటి నుంచి జూన్ 11వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని( Badi Bata ) చేపట్టనున్నారు.
ఈ క్రమంలోనే 12న స్కూల్స్ రీఓపెన్ కానుండగా.ఏప్రిల్ 24, 2025 వరకు మొత్తం 229 పని దినాలు ఉండనున్నాయి.అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉండనుండగా.డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు.
అదేవిధంగా జనవరి 13, 2025 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.ఇక 2025 ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఉండనుండగా.
వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం క్యాలెండర్ లో వెల్లడించింది.