ఆ సమస్య వల్ల ఆరు రోజులు మాట్లాడలేకపోయిన విశ్వక్ సేన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్( Vishwak Sen ) కు నటుడిగా మంచి గుర్తింపు ఉండటంతో పాటు వరుస విజయాలు సాధిస్తున్నారు.విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా( Gangs of Godavari ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

 Vishwak Sen Health Issues Become Hot Topic In Social Media Details Here ,vi-TeluguStop.com

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగ విశ్వక్ సేన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.విశ్వక్ సేన్ ట్రైలర్ లో టైగర్ టైగర్ అంటూ డైలాగ్స్ చెబుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.మాస్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఈ ట్రైలర్ ను కట్ చేయడం గమనార్హం.మరోవైపు త్రివిక్రమ్ ఇప్పటివరకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించి ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదని త్రివిక్రమ్ ( Trivikram )చూడకుండానే సినిమా విడుదల అవుతోందని విశ్వక్ సేన్ అన్నారు.

తనకు గొంతు పట్టేయడం వల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడిందని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.గొంతు పట్టేయడం వల్ల ఆరు రోజుల పాటు సరిగ్గా మాట్లాడలేకపోయానని ఆయన అన్నారు.ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సక్సెస్ సాధిస్తే విశ్వక్ సేన్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగే అవాకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ హీరో కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube