రోడ్డు ప్రమాదంలో 16 మంది క్రీడాకారుల దుర్మరణం.. కెనడాలో భారతీయ ట్రక్క్ డ్రైవర్‌కు దేశ బహిష్కరణ

ఆరేళ్ల క్రితం కెనడాలో హంబోల్డ్ బ్రోంకోస్ బస్సు ప్రమాదంలో( Humboldt Broncos Bus Accident ) 16 మంది హాకీ ఆటగాళ్ల మరణానికి కారణమైన భారత సంతతి ట్రక్ డ్రైవర్‌ జస్కిరత్ సింగ్ సిద్ధూను( Jaskirat Singh Sidhu ) భారత్‌కు బహిష్కరించాలని ఆదేశించినట్లు కెనడాకు చెందిన సీబీసీ న్యూస్ నివేదించింది.కాల్గరీలో జరిగిన విచారణలో జస్కీరత్ సింగ్ సిద్ధూపై ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

 Indian-origin Truck Driver Who Caused Bus Crash That Killed 16 Hockey Players In-TeluguStop.com

సిద్ధూ కెనడా పౌరుడు కాదని, అతను చేసిన నేరానికి బహిష్కరణే( Deport ) శిక్ష అని సిద్ధూ తరపు న్యాయవాది మైఖేల్ గ్రీన్ తెలిపారు.సీబీసీ న్యూస్ నివేదిక ప్రకారం .జస్కీరత్ సింగ్ సిద్ధూ భారతదేశానికి చెందినవాడని, కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ స్టేటస్‌ను కలిగి ఉన్నాడని చెప్పారు.

Telugu Bus Crash, Canada, India, Federal, Humboldtbroncos, Indianorigin, Jaskira

2018 ఏప్రిల్ 6న సస్కట్చేవాన్ హైవే 35, సస్కట్చేవాన్ హైవే 335లోని ఆర్మ్‌లే ఇంటర్‌సెక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.సీబీసీ న్యూస్ ప్రకారం సిద్ధూకు అప్పుడే కొత్తగా పెళ్లయ్యింది.ఇతను తన ట్రక్కుతో సస్కట్చేవాన్‌లోని( Saskatchewan ) టిస్‌డేల్ సమీపంలో వున్న రూరల్ జంక్షన్ వద్ద .జూనియర్ హాకీ జట్టును( Junior Hockey Team ) ప్లే ఆఫ్ గేమ్‌కు తీసుకెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది.గతేడాది డిసెంబర్‌లో .సిద్ధూ తనను భారత్‌కు బహిష్కరించడానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ తిరస్కరించింది.సిద్ధూ నేర చరిత్రను, పశ్చాత్తాపాన్ని అధికారులు పరిగణించలేదని.

రెండోసారి సమీక్ష నిర్వహించేలా బోర్డర్ ఏజెన్సీని ఆదేశించాల్సిందిగా గ్రీన్ కోర్టును కోరారు.

Telugu Bus Crash, Canada, India, Federal, Humboldtbroncos, Indianorigin, Jaskira

సిద్ధూని బహిష్కరించాలని ఆదేశించిన తర్వాత మానవతా ప్రాతిపదికన అతని శాశ్వత నివాస హోదా తిరిగి ఇవ్వాలని కోరుతామని మైఖేల్ గ్రీన్( lawyer Michael Greene ) పేర్కొన్నారు.ఈ ప్రక్రియకు నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చన్నారు.అయితే బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులు జస్కీరత్ సింగ్ సిద్ధూని బహిష్కరించాలని కోరినట్లు నివేదిక తెలిపింది.

గతేడాది ప్రారంభంలో సిద్ధూకు పెరోల్ మంజూరు చేయగా.కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ మాత్రం అతనిని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా సిఫారసు చేసింది.సిద్ధూ తరపున మైఖేల్ గ్రీన్.2023 సెప్టెంబర్‌లో ఫెడరల్ కోర్టు ముందు వాదనలు వినిపించారు.అయితే న్యాయమూర్తి మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చారు.ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు పోయాయని, కొందరు జీవచ్చవాల్లా మిగిలి వారి ఆశలు, కలలు చెదిరిపోయాయని ప్రధాన న్యాయమూర్తి పాల్ క్రాంప్టన్ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube