సినీ నటి కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) హీరోయిన్ గా నటించినటువంటి తాజా చిత్రం సత్యభామ( Satyabama ) ఈ సినిమా జూన్ 7వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి నటుడు బాలకృష్ణ ( Balakrishna) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఈ చిత్ర బృందం గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కాజల్ ( Kajal Agarwal ) గురించి బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.కాజల్ నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ చాలా బాగుందని ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అంటూ ప్రశంసలు కురిపించారు.ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి నటిస్తారని బాలయ్య తెలిపారు.
ఇప్పటివరకు కాజల్ నటించిన అన్ని పాత్రలలోకి ఈమె పరకాయ ప్రవేశం చేసి మరి నటించారని తెలిపారు.
ఇక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడమే కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక చాలామంది హీరోయిన్లు పెళ్లి అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అవకాశాలు అందుకుంటారు.కానీ కాజల్ మాత్రం హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేస్తున్నారని తెలిపారు.
ఆమె ఎనర్జీ లెవెల్ కి హాండ్స్ ఆఫ్ చెప్పాలి తన సినిమాలన్నింటిని చూస్తున్నాను తనతో నటించాలని ఎప్పుడూ అనుకునేవాడిని ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు.భగవంత్ కేసరి( Bhagavanth Kesari )లో మేము కలిసి పని చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని బాలయ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.