నాపై వచ్చే ట్రోల్స్ ను చూసి నేను అలా ఫీలయ్యేదాన్ని.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి( Lakshmi Manchu ) గురించి మనందరికి తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Manchu Lakshmi Speaks About Bangalore Rave Party, Manchu Lakshmi, Bangalore, Rav-TeluguStop.com

ప్రస్తుతం వరుసగా సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే మంచు లక్ష్మి, అజయ్‌, వేదిక, ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌ సిరీస్‌ యక్షిణి ఈ సిరీస్ కీ తేజ మార్ని దర్శకత్వం వహించారు.

జూన్‌ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మూవీ మేకర్స్.

Telugu Ajay, Bangalore, Bollywood, Manchu Lakshmi, Rave, Tollywood, Yakshini-Mov

ఈ సందర్బంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేసారు.అలాగే రిపోర్టర్స్ అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.నేను బాలీవుడ్‌కు వెళ్లానని కొందరు భావిస్తున్నారు.కానీ నేను ముంబై( Mumbai )కీ షిఫ్ట్‌ అయ్యాను అంతే.నాకు ఏ భాష అయినా ఒకటే.హాలీవుడ్‌ నుంచి వచ్చాను.

ఇప్పుడు టాలీవుడ్‌లో చేస్తున్నాను.కోలీవుడ్‌లో చేశాను.

నటీనటులకు భాషతో సంబంధం ఉండదు.హైదరాబాద్ నా ఇల్లుతో సమానం.

నా కుటుంబమంతా ఇక్కడే ఉంటుంది.నా కెరీర్‌ కోసం, నా కుమార్తె భవిష్యత్తు కోసం ముంబయి వెళ్లాను అంతే.

దిల్లీ వెళ్లాలనుకున్నా కానీ ముంబయి అయితే కెరీర్‌కు కూడా బాగుంటుందని షిఫ్ట్‌ అయ్యాను.

Telugu Ajay, Bangalore, Bollywood, Manchu Lakshmi, Rave, Tollywood, Yakshini-Mov

అనంతరం రేవ్ పార్టీ గురించి స్పందిస్తూ.రేవ్‌ పార్టీలో ఏం జరిగిందో తెలియదు.ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదు.

చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్‌ సిరీస్‌ మీ ముందుకు రానుంది.దాని గురించి మాట్లాడదాం.

ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం.ఆ వ్యక్తులు వాళ్ల ప్రాబ్లమ్‌ అంతే.

నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని.మీ బిడ్డని.

నాది మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడేతత్వం.కొందరు నన్ను ట్రోల్స్‌ చేయడం చూసి బాధేసేది.

పొలిటికల్‌గా మాట్లాడడం మాకు రాదు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం.

అది కొందరికి నచ్చుతుంది.మరికొందరికి నచ్చదు.

నచ్చినవాళ్లు అభిమానిస్తారు.ఎవరో కావాలని నన్ను ట్రోల్‌ చేస్తారని భావించను.

ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. రానా, చరణ్‌, తారక్‌ మేమంతా కలిసి పెరిగాము మేమంతా కలిసే ఉన్నాము అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube