తిండి మెల్లిగా తినాలా? తొందరగా తినాలా?

ఉదయం ఆలస్యంగా లేస్తారు.గడియారం వంక చూసేసరికి ఇవాళ ఆఫీసో, కాలేజో ఉందని జ్ఞానోదయం అవుతుంది.

 How To Eat? Fast Or Slow?-TeluguStop.com

దాంతో గబాగబా పనులు పూర్తిచేసుకోని గబాగబా దొరికింది తినేసి బయలుదేరుతారు.బిజీ జీవితంలో దాదాపు ప్రతిరోజూ ఇలానే గడుస్తోంది.

ఇక మరోవైపు, కొంతమంది ఉంటారు.ఇలా తినడం మొదలుపెట్టారో లేదో, అలా తినడం పూర్తయిపోతుంది.

ఇలా గబగబా తినటం మంచిదేనా? లేదంటే మెల్లిగా తినాలా? లోతుగా అలోచిస్తే, తొందరతొందరగా తినటానికి ఇదేమి పరుగుపందెం కాదు.గబాగబా తినటం వల్ల ఎన్ని అనర్థాలో చూడండి

* ఎంత తిండి సరిపోతుందో, ఎక్కడ తినడం ఆపాలో చెప్పేది మీ కడుపు కాదు, మెదడు.

గబాగబా తినటం వలన మెదడుకి సంకేతాలు పంపే సమయం కడుపుకి దొరకదు.దాంతో అవసరానికి మించి తినేస్తుంటారు.అలా కాకుండా నెమ్మదిగా, తృప్తిగా తినటం వలన ఎక్కడ ఆపాలో మెదడు సూచిస్తుంది.దాంతో తక్కువ కాలరీలు మీ ఒంట్లో పడతాయి

* ఇంతకుముందు చెప్పినట్లుగానే గబాగబా తినటం వలన అవసరానికి మించి తినేస్తుంటారు.

దాంతో ఎక్కువ కాలరీలు ఒంట్లో చేరి అధికబరువు సమస్యను మోసుకొస్తాయి

* త్వరత్వరగా తినటం వలన “Gastroesophagal reflux disease” అనే సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలే కాదు, ఛాతిలో మంట కూడా మొదలవ్వొచ్చు

* ఆదరాబాదరగా తినటం అంటే మీ మెదడుని, కడుపుని, మొత్తం శరీరాన్ని స్ట్రెస్ లో పెట్టడం.

తినేటప్పుడు కూడా బాడిని ఒత్తిడిలో పెట్టడం మంచి పద్ధతి కాదు

* ఇక చివరగా చెబుతున్నా, చాలా ముఖ్యమైన విషయం.తిండి అనేది కేవలం ఆకలి కోసమే కాదు, రుచి కోసం కూడా తీసుకుంటాం మనం.ఆదరాబాదరగా తినేటప్పుడు తిండి మీద దృష్టి తక్కువ, చేయాల్సిన పని మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది.ఇలా త్వరత్వరగా తినటం వలన తినే తిండిని, దాని రుచిని సరిగా ఆస్వాదించలేం.

కాబట్టి తినేటప్పుడు తిండి తప్ప మరో ధ్యాస లేకుండా, మెల్లిగా తినాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు