రాజన్న సిరిసిల్ల జిల్లా: సుస్థిర లాభాలకు ఆయిల్ పామ్ సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ జిల్లా రైతులకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాల ను వివరించారు.ప్రకటన సారాంశం ఆయన మాటల్లోనే…….
ఎందుకంటే సులువుగా పండే పంట ఏదంటే వరి ఉండేది ఒకప్పుడు.కానీ ఇప్పుడు వరి పంట నారుమడి నుంచి కోత కోసే వరకు వివిధ రకాల చీడ పీడలు,ఇతరత్ర ఆశించి చీడల, రోగాల మందుల పిచికారీలు కనీసం ఆరు నుంచి ఎనిమిది సార్లు చేయవలసి వస్తున్నది.
పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయలు సాగు ఖర్చు పెరుగుతున్నది.ఇది చాలదన్నట్టు కోత దశలో అకాల వర్షాలు వలన పంట బాగా దెబ్బతింటున్నది, ఆ వచ్చిన కొంత దిగుబడిని అమ్ముకోవడానికి చాలా కష్టం అవుతుంది.
చివరకు ఆదాయం కంటే సాగు ఖర్చు ఎక్కువగా ఉండి, వరి సాగు చేసినందుకు నష్టాల్లోకి నెట్టబడుతున్నావు.
ఈ బాధల నుండి తప్పించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నది అదే ఆయిల్ పామ్ ( పామ్ ఆయిల్ ) పంట సాగు.ఎందుకంటే1) ఇది వరి పంట మదిరిగా కాకుండా బాగా డిమాండ్ ఉన్న పంట.2) అమ్ముకోడానికి ఇబ్బంది ఉండదు పంట మొక్కలు ఇచ్చిన కంపెనీ వారే పంటను, దళారులు లేకుండా నేరుగా కొంటారు.3) ఈ పంట వలన అతి ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.ప్రతి సంవత్సరం దున్నుకోవడం, విత్తనాలు కొనుక్కోవడం, నాటేసుకోవడం అవసరం ఉండదు,ఒకసారి పామ్ ఆయిల్ మొక్కలు నాటితే, నాల్గవ సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం జూలై నెల నుండి మొదలు జనవరి నెల వరకు గెలలు పండుతూ నిరంతరం దిగుబడినిస్తుంది.4) కంపెనీ కొనే ధర కూడా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే కంపెనీ ప్రతినిధులు,ప్రభుత్వ ప్రతినిధులు మరియు పామాయిల్ పండించే రైతు ప్రతినిధులు అందరూ కలిసి సాగు ఖర్చు బట్టి, ధర నిర్ణయిస్తారు. రైతు యాజమాన్యాన్ని బట్టి పంట దిగుబడి ఎకరానికి 10 నుంచి 15 టన్నులు వస్తుంది.కనిష్ట మరియు గరిష్టధరలు టన్నుకి Rs10000- 24000 వున్నాయి.5) ప్రభుత్వమే 90% సబ్సిడీతో మొక్కలు ఇస్తుంది.ఎకరానికి 57 మొక్కలు అవసరం ఉంటాయి వాటికి రైతులు వాటా Rs1140/- చెలిస్తే సరిపోతుంది.ఈ పంటకు డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి దీనికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.
ఏ విధంగా చూసుకున్నా పామ్ ఆయిల్ పంట ,వరి మరియు ఇతర పంటలతో పోల్చితే చాలా లాభదాయకం.
పామ్ అయిల్ పంట తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబ్బటి, వరి పండించే పెద్ద రైతు(Big farmers )సోదరులందరూ, వరి సాగును వచ్చే వానాకాలం లో తప్పక కొంత తగ్గించి ఆ స్థానంలో ఆయిల్ ఫామ్ సాగు చేయండి,ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ వ్యవసాయం విస్తరణ అధికారిని / మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ కోరారు.