దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.ఈడీ కేసులో బెయిల్ కోరుతూ అమిత్ అరోరా రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.ఈ క్రమంలో అమిత్ అరోరాకు అవసరమైన వైద్య పరీక్షలు జైలులోనే జరుగుతున్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది.
అమిత్ అరోరా ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాలని జైలు సూపరింటెండెంట్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.







