పెళ్లి చేసుకునే వ్యక్తి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో తరహా ఇష్టాలుంటాయి.యంగ్ హీరోయిన్ కృతిశెట్టి(Krithi Shetty) వయస్సు ప్రస్తుతం 19 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.
చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి కెరీర్ తొలినాళ్లలో హ్యాట్రిక్ విజయాలను(Hatrrick Hits) అందుకుని ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులతో ఢీలా పడ్డారు.కస్టడీ(Custody) సినిమాతో అయినా కృతి కోరుకున్న సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ భావించగా ఈ మూవీ కూడా అంచనాలను అందుకోలేదు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాగా ఆ ప్రశ్నలకు కృతిశెట్టి తనదైన శైలిలో జవాబిచ్చారు.నాకు కాబోయే వాడు బొద్దుగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.
నిజాయితీగా, సింపుల్ గా ఉండే వ్యక్తులంటే నాకు ఇష్టమని కృతిశెట్టి పేర్కొన్నారు.ఇంట్లో నన్ను బుంగి(Bungi) అని పిలుస్తారని కృతి కామెంట్లు చేశారు.

బంగార్రాజు(Bangarraju) సినిమాలో నేను పోషించిన సర్పంచ్ నాగలక్ష్మి(Nagalakshmi) పాత్రను నాన్న ఎంతగానో ఇష్టపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.రామ్ చరణ్(Ram Charan) శివ కార్తికేయన్ అంటే నాకు ఎంతో ఇష్టమని కృతి పేర్కొన్నారు.నాకు అలియా భట్(Alia bhatt) ఇన్ స్పిరేషన్ అని శివ కార్తికేయన్ యాక్టింగ్ కు నేను ఫిదా అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.స్టోరీ సెలక్షన్ విషయంలో అలియా భట్ నచ్చుతుందని కృతి వెల్లడించారు.

శ్యామ్ సింగరాయ్(Shyam Singaroy) మూవీలో సిగరెట్ తాగే సీన్ లో నటించడానికి చేతులు వణికాయని కృతిశెట్టి పేర్కొన్నారు.ఆ సీన్ కోసం పొగాకు లేని సిగరెట్లు తాగానని ఆమె అన్నారు.హాలీవుడ్ సినిమాల ద్వారా స్మోకింగ్ ఎక్స్ ప్రెషన్లు నేర్చుకున్నానని కృతిశెట్టి చెప్పుకొచ్చారు.కృతిశెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరోయిన్ కృతిశెట్టి పారితోషికం ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.