కర్నాటక ఎన్నికలు( Karnataka Elections ) ఎట్టకేలకు ముగిశాయి.ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పేరు గట్టిగా వినిపించింది.
కర్నాటక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పోటీ చేస్తుందని, సరిహద్దు ప్రాంతాలలో బిఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని, జెడిఎస్ పార్టీకి బిఆర్‌ఎస్ మద్దతుగా నిలుస్తుందని ఇలా రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్వయంగా కేసిఆరే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా.
తీర ఎన్నికల సమయానికి మౌనం వహించారు.దాంతో ఎన్నికల ముందు నానా హంగామా చేసిన కేసిఆర్ ( KCR ) ఎందుకు మౌనం వహించారు ? ఎన్నికల బరి నుంచి ఎందుకు తప్పుకున్నారు ? అనే ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారితీశాయి.
జెడిఎస్ కు మద్దతుగా నిలుస్తామని చెప్పినప్పటికి అది కూడా జరగలేదు.కనీసం ప్రచారం కూడా చేయలేదు.దీంతో కర్నాటక విషయంలో కేసిఆర్ ఏం అలోచిస్తున్నారనే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.అయితే బీజేపీ ( BJP ) గెలుపు కోసమే కేసిఆర్ మౌనం వహించరనేది కాంగ్రెస్ వినిపిస్తున్న విమర్శ.
కేసిఆర్ బీజేపీ కోసం పని చేయడం ఏంటి ? బీజేపీ నేతలపై, మోడి సర్కార్ పై నిప్పులు చెరిగే కేసిఆర్ బీజేపీకి మద్దతుగా నిలుస్తారా ? అసలు అది సాధ్యమేనా ?.అనే ప్రశ్నలకు వై నాట్ అనే సమాధానాన్ని వినిపిస్తోంది కాంగ్రెస్.కర్నాటకలో హంగ్ ఏర్పడితే బీజేపీకి జెడిఎస్ మద్దతు తెలిపే విధంగా కేసిఆర్ వ్యూహ రచనా చేశారని,

అక్కడ బీజేపీ విజయం కోసమే కేసిఆర్ కావాలనే మౌనం ఎన్నికలకు దూరంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఆరోపించారు.ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గాని, ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.కన్నడనాట మూడు ప్రధాన పార్టీల మద్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితమైన అధికారాన్ని ఏ పార్టీకి కట్టబెట్టలేదు.దీంతో హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది కొందరి విశ్లేషకుల వాదన.

హంగ్ ఏర్పడితే జెడిఎస్ మద్దతు కీలకం అవుతుంది.జెడిఎస్ మద్దతుతోనే బీజేపీ గాని లేదా కాంగ్రెస్ గాని అధికారం చేపట్టాల్సి ఉంటుంది.ఇక్కడే కేసిఆర్ తన చతురత ప్రదర్శించబోతున్నారనేది కాంగ్రెస్ వినిపిస్తోన్న మాట.కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే జెడిఎస్ ప్రకటించింది కూడా.దీన్ని బట్టి చూస్తే జెడిఎస్ మద్దతు బీజేపీకె అనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.మరి ఇది కేసిఆర్ వ్యూహమేనా అనేది ఆసక్తికరమైన అంశం.మొత్తానికి తుది ఫలితాలతోనే అన్నీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.