ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు( AP Politics ) పొత్తుల విషయంలో రోజురోజుకీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan )… ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి.
వచ్చే ఎన్నికలలో కచ్చితంగా జనసేన… టీడీపీ పొత్తు( TDP Alliance ) పెట్టుకుని పోటీపడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో పొత్తులపై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఒక స్థాయి ఉన్న రాజకీయపక్షం.మా స్థాయిలోనే మేము వెళ్తున్నాం అని చెప్పుకొచ్చారు.ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది.బీజేపీ ఎక్కడ లయ తప్పే పార్టీ కాదు అని అన్నారు.
రాష్ట్ర ప్రజల కోసమే సీఎం జగన్( CM Jagan ) కు సాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.వ్యక్తిగత అపేక్షలు ఎక్కడ ఉండవని పేర్కొన్నారు.
ఆయన యొక్క వ్యవహార శైలి వ్యత్యాసం అని.స్పష్టం చేశారు.దీంతో సోము వీర్రాజు( Somu Veerraju ) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.