పాకిస్తాన్ చైనా(Pakistan ) దోస్తీ గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఒక శత్రువుని ఓడించాలంటే ఆ శత్రువు తాలూక ఇద్దరు శత్రువులు మిత్రులు అయితే చాలు అని అంటారు.
ఈ మాట ఈ ఇరుదేశాల విషయంలో నిజమైంది.అవును, మనదేశానికి అనుకొని వున్న ఈ ఇరుదేశాలు మనమీద గుర్రుతోనే ఒక్కటి అయినాయనే విషయం ఇక్కడ ఏ చిన్న పిల్లాణ్ణి అడిగినా చెబుతారు.
ఈ క్రమంలోనే పాకిస్థాన్లో చైనా అనేక వ్యాపారాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే వన్ రోడ్ వన్ బెల్ట్ విధానంలో రోడ్లు వేస్తుంది.అయితే ఖైబర్ పంక్తువాలో మాత్రం ఈ రోడ్ల నిర్మాణం అక్కడి ప్రజలకు, తాలిబాన్లకు అస్సలు నచ్చడం లేదు.ముఖ్యంగా ఖైబర్ పంక్తువా( Khyber Pakhtunkhwa )లో చైనా 4 వాచ్ టవర్లను నిర్మించింది.
ఇవి చెప్పడానికి వాచ్ టవర్లు కానీ అక్కడి నుంచి భారత దేశ సైన్యం గురించి తెలుసుకునే రాడార్ల లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తుందనేది ఒక అభియోగం.అయితే ఉన్నట్లుండి నాలుగు వాచీ టవర్లను ఎవరో పేల్చేశారు.
రాకెట్ లాంటి ఆయుధాలతో ధ్వంసం చేయడం జరిగింది.
అయితే పాకిస్థాన్ మాత్రం ఇది ఇండియా( India ) చేసిన పని అని ఆరోపణలు చేస్తుంది.వీటిని పేల్చేయడం వెనక ఇండియా కుట్ర ఉందని కూడా ఆరోపిస్తుంది.పాకిస్థాన్ లో అనేక అభివృద్ది పనులకు ఇప్పటికే కొన్ని వేల డాలర్ల అప్పు ఇచ్చింది డ్రాగన్ కంట్రీ.
కానీ ఇప్పటికీ పాక్ ని ఆర్థిక సంక్షోభం భంకరంగా వెంటాడుతోంది.
దాని నుంచి ఎలా బయట పడాలో తెలియని పాక్ ఇలాంటి దాడులను చూపి భారత్ పై ఆరోపణలు చేసి చైనా నుంచి మరింత అప్పు పొందాలనే ప్రయత్నం చేస్తోంది.కానీ పాక్ లో ఉన్న జనానికి చైనా తమ దేశంలో ఆధిపత్యం చెలాయించడం అస్సలు ఇష్టం లేదు.అయితే ఈ తాజా ఆరోపణపై భారత్ ఎలా స్పందిస్తోందో చూడాలి.