ఈమధ్య కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ వస్తున్నాయి.దీనికి కారణం మనుషులకు జంతువులపైన మీద వున్న ప్రేమే కారణం కావచ్చు.
ఈ క్రమంలోనే ఎక్కడలో అడవుల్లోని బతుకుతున్న క్రూరమృగాలను( wild beasts ) తమ సెల్ ఫోన్లలో చూసి మనవాళ్ళు ఆనందిస్తూ వుంటారు.అవును, అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియోలుకు ఇపుడు అభిమానులు చాలా మంది ఉన్నారని సోషల్ మీడియా చెప్పకనే చెబుతోంది.

అయితే దాదాపుగా అలాంటి వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.అవి చేసే పనులు కొన్ని సార్లు భయానికి గురి చేస్తే మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి.మరికొన్ని చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి.తాజాగా ఈ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే తాజాగా వైరల్ అవుతోన్న వీడియో పులికి సంబంధించింది.ఈ వీడియోలో పులి దాని పిల్లలతో చాలా ప్రేమగా ఉండడం చూడొచ్చు.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ( Sushanta Nanda )వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ ఫుటేజీలో, పిల్లలు తల్లి పులితో కలిసి చాలా చక్కగా నడుస్తున్నట్లు కనబడుతోంది.పులి ( Tiger )ఎక్కడికి వెళ్లినా ఆ పిల్లలు దాన్ని వెంబడించడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోపై ఇప్పటికే చాలా మంది ప్రేమతో స్పందించడం జరిగింది.
తల్లిపులి అడవిలో నడుస్తూ ఉంటే.వెనక 4 పులి పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ తల్లిని ఫాలో అవుతూ ఉండడం చూడవచ్చు.
ఈ వీడియో చూడటానికి చాలా ముచ్చటగా కనిపించడంతో చాలామంది నెటిజన్లు దానిని షేర్లు చేస్తున్నారు.మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.







