మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.వీధి కుక్కలకు గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టి చంపారు.
ఈ ఘటనలో మొత్తం వందకు పైగా శునకాలు మృతిచెందాయి.దీంతో చలించిపోయిన జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుక్కలను పోస్టుమార్టం నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.రిపోర్ట్స్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.







