Dil Raju Shaakuntalam : పాతికేళ్ల కెరీర్ లో శాకుంతలం చిత్రం పెద్ద జర్క్.. షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju ) గురించి ప్రత్యేకంగా పరిచయ అక్కర్లేదు.టాలీవుడ్ లో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు దిల్ రాజు.

 Dil Raju Shocking Comments On Shaakuntalam Movie Result-TeluguStop.com

వరుసగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో దిల్ రాజు సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే హైలైట్ అవుతున్న విషయం తెలిసిందే.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన వ్యక్తిగత విషయాల గురించి స్పందించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.నా మొదటి భార్య అనిత 2017 లో మరణించింది.తర్వాత రెండేళ్ల పాటు వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నాను.

తర్వాత 2020లో తేజస్విని రెండవ వివాహం చేసుకున్నాను.అయితే అనిత మరణించిన తర్వాత రెండవ పెళ్లి గురించి చాలా ఆలోచించాను.

రెండవ పెళ్లికి ముందు తప్ప ఒప్పా అని నిర్ణయం తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాను.నా 25కి ఏళ్ల కెరియర్ లో ఎన్నో సినిమాలు హిట్గా ప్లాప్ గా నిలిచాయి.

కానీ నా పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం( Shaakuntalam ) సినిమా పెద్ద జర్క్ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.మూవీ విడుదల తర్వాత సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.కాగా గుణశేఖర్ తన కుమార్తె నీలిమతో( Neelima Guna ) కలసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించిన సంగతి తెలిసింది.

కానీ రిలీజ్ చేసింది మాత్రం దిల్ రాజు.దాంతో దిల్ రాజుకు కూడా భారీ నష్టం తప్పలేదు.పౌరాణిక చిత్రం గా తెరకెక్కిన శాకుంతలం ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube