అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో( New York ) భారత సంతతి వ్యక్తికి కీలక పదవి దక్కింది.ఇండో అమెరికన్ ఉదయ్ తంబార్‌ను( Indo-American Uday Tambar ) జాతులు, జాతి వివక్ష , సమానత్వం వంటి అంశాలలో సంస్కరణలు చేసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డులో నియమించారు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్( Mayor Eric Adams ).
ఈ బోర్డులో 15 మంది విశిష్ట వ్యక్తులు , నిపుణులు సేవలందిస్తున్నారు.ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మార్పులను విజయవంతంగా అమలు చేయడంతో పాటు జాతి సమానత్వానికి కృషి చేయడంలో నిబద్ధత , అనుభవం వున్న 15 మంది విభిన్న వ్యక్తులకు ఈ అడ్వైజరీ బోర్డులో చోటు కల్పించినట్లు మేయర్ ఆడమ్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మేయర్ ఆఫీస్ ఆఫ్ ఈక్విటీ సహకారంతో.వీరంతా నగరవ్యాప్తంగా జాతి సమానత్వ ప్రణాళికలను రూపొందిస్తారు.
ఉదయ్ తంబార్ నార్త్‌వెల్త్ హెల్త్‌లో కమ్యూనిటీ హెల్త్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.ప్రస్తుతం న్యూయార్క్ జూనియర్ టెన్నిస్ అండ్ లెర్నింగ్( Junior Tennis and Learning ) (ఎన్‌వైజేటీఎల్) ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.టెన్నిస్ శిక్షణకు సంబంధించి ఇది దేశంలోనే అతిపెద్ద ఎన్జీవో సంస్థ.ఇక్కడ దాదాపు 85000 వేల మందికి పైగా యువతకు సేవలందిస్తున్నారు.
ఈ సందర్భంగా అడ్వైజరీ బోర్డులో తన నియామకంపై ఉదయ్ హర్షం వ్యక్తం చేశారు.ఎన్‌వైజేటీఎల్‌లో తాము సేవలందిస్తున్న కుటుంబాలలో ఎక్కువభాగం సామాన్యులు, శ్వేతజాతీయేతర ప్రజలేనని ఆయన చెప్పారు.వారు అభివృద్ధి చెందేలా , సమాజంలో ఉన్నతంగా జీవించేలా చేయడం కీలకమన్నారు.న్యూయార్క్ సిటీ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, యూత్ అండ్ చిల్డ్రన్ సర్వీసెస్ డైరెక్టర్, సౌత్ ఏషియన్ యూత్ యాక్షన్( South Asian Youth Action ) (ఎస్‌వైయూఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇలా పలు హోదాల్లో పనిచేసిన ఉదయ్.
తన జీవితంలో ఎక్కువ భాగాన్ని యువత శ్రేయస్సు కోసమే అంకితం చేశారు.కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పట్టభద్రుడైన ఉదయ్.ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్ అందుకున్నాడు.