రాష్ట్రాన్ని దోచుకునే వాళ్లకు 4 లక్షలు సేవ చేసే వాళ్లకు 3900 జీతమా...?

నల్లగొండ జిల్లా: రాష్ట్రాన్ని నిలువునా దోచుకునేటోళ్లకు నెలకు నాలుగు లక్షల జీతం,సేవ చేస్తూ వెట్టి చాకిరీ చేసే వారికి రూ.3900 జీతమా అని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ప్రశ్నించారు.శనివారం చిట్యాల మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ…గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విఓఏల న్యాయమైన డిమాండ్లనురాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని డిమాండ్ చేశారు.ప్రత్యేక రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశతో పోరాడి తెలంగాణను తెచ్చుకుంటే నిరాశే మిగిలిందని అవేదన వ్యక్తం చేశారు.

 3900 Salary For Those Who Serve 4 Lakhs For Those Who Loot The State...?-TeluguStop.com

ఎన్నో ఏళ్ల తరబడి గ్రామ స్థాయిలో 200 రూపాయల నెల జీతంతో ఐకెపి వివోఏలుగా పనిచేస్తున్నప్పటికీ నేటికీ 3900 రూపాయలను పెంచిందని,అది కూడా మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఇస్తూ అనేక రకాలుగా పని ఒత్తిడికి గురిచేసి కనీస వేతనం ఇవ్వకుండా కనీస భద్రత కల్పించకుండా వాళ్ళని వారి కుటుంబాలని రోడ్డు పాలు చేస్తున్నారని వాపోయారు.

కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని కెసిఆర్ కు మాత్రమే నెల జీతం నాలుగు లక్షల పైనే ఉందని ఆరోపించారు.

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ ఈ బహుజన,అగ్రవర్ణ పేద ఉద్యోగస్తుల పైన ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న వివోఏల సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ మద్దతుగా ఉంటుందని తెలిపారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విఏవోలకు కనీస వేతనం రూ.26 వేలు కేటాయిస్తూ,వారిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని,వారికి ఆరోగ్య భీమా కల్పించాలని డిమాండ్ చేశారు.వారి డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున విఓఏ వాళ్లకు మద్దతుగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గ్యార శేఖర్, మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, విఓఏ మండల అధ్యక్షులు ఎదుళ్ల లక్ష్మి,ఉపాధ్యక్షులు గుడిసె పద్మ,బంగాళ వనజ కుమారి,ప్రధాన కార్యదర్శి గుడిసె సువర్ణ, సహాయ కార్యదర్శి పాకల సత్యనారాయణ,దేశపాక సత్తమ్మ,కోశాధికారి వడ్డగానే విజయ బీఎస్పీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube