ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు.ఈయన తన సినిమాలను స్పీడ్ గా పూర్తి చేస్తూనే ప్రతీ నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలపై స్పందిస్తున్నారు.
ఇక యంగ్ తరాన్ని కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వారిని ప్రోత్సహించడంలో కూడా చిరు ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు.
మరి ఈ విషయంపై తాజాగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ( Atulya Ravi) కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ చిరుకు ధన్యవాదములు తెలిపింది.అసలు విషయం ఏంటంటే.యంగ్ హీరోయిన్ అతుల్య రవి టాలీవుడ్ లోకి ”మీటర్” సినిమాతో అరంగేట్రం చేయబోతుంది.
ఈ నేపథ్యంలోనే అతుల్య రవి, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ ను తీసుకుంది.
ఈయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ”అత్యంత సంతోషకరమైన క్షణం ‘మీటర్’ సమయంలో జరిగింది అని.నన్ను ఆశీర్వదించి పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ కు ధన్యవాదాలు అని.ఇది నాకు జీవితకాల జ్ఞాపకం” అంటూ ఈమె షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా మీటర్ ( Meter Movie ) సినిమాలో హీరోగా యంగ్ నటుడు కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) నటించారు.
ఇక ఈ సినిమాకు డైరెక్టర్ రమేష్ కడూరి ( Ramesh Kaduri )దర్శకత్వం చేయగా ఈ నెల ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాతోనే ఈ అమ్మడు తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.ఇప్పటికే ప్రమోషన్స్ తో ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు మేకర్స్.ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళీ, సప్తగిరి, పవన్ కీలక పాత్రల్లో నటించగా హేమలత, చిరంజీవి ఈ సినిమాను నిర్మించారు.