మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తొలి 10 మంది ధనవంతుల లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) పేరు ఉంటుంది.లక్షల కోట్ల సంపద ఉన్న ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, అది ఎంతో వైరల్ అవుతోంది.
తాజాగా ముఖేష్ భార్య నీతా అంబానీ ( Nita Ambani )ఇటీవల కల్చరల్ సెంటర్ను ముంబైలో ప్రారంభించారు.దీనికి బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన స్టార్ల కోసం అంబానీ ఫ్యామిలీ ఎన్నో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
కార్యక్రమానికి వచ్చిన అతిథులను కూడా అద్భుతమైన రీతిలో చూసుకున్నారు.అతిథులకు సిల్వర్ ప్లేట్లో రకరకాల వంటకాలు వడ్డించారు.అందులో టిష్యూ పేపర్ల స్థానంలో రూ.500ల నోట్లు ఉన్నాయి.దీంతో ఈ ఫొటోలపై అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ఈ చిత్రాలను సంజయ్ కపూర్( Sanjay Kapoor ) భార్య మహీప్ కపూర్( Maheep Kapoor ) తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా పంచుకున్నారు.మహీప్ కపూర్ తన అభిమానులతో ఈ కార్యక్రమంలో వడ్డించిన ఫుడ్ ప్లేట్ ఫొటోను పోస్ట్ చేశారు.అందులో వివిధ రకాలైన భారతీయ వంటకాలు అందించబడ్డాయి.ప్లేట్లో రోటిస్, కాయధాన్యాలు, బచ్చలికూర, జున్ను, కూర, పుడ్డింగ్, పాపాడ్, స్వీట్లు మరియు లాడస్ అలాగే గుజియా ఉన్నాయి.
అదే సమయంలో అతిథులకు పార్టీలో ₹ 500 నోట్లతో డిష్ అందించారు.అయితే అందులో ఉన్నవి నిజమైన నోట్లు కావు.దాని వంటకం పేరు ‘దౌలత్ కి చాట్’.ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దీనిని ఎక్కువగా తింటుంటారు.
ముఖ్యంగా ఇది పాత ఢిల్లీలో ( Delhi )ఈ ప్రత్యేక వంటకాన్ని ఎక్కువగా తింటారు.ఈ ప్రత్యేకమైన తీపి వంటకాన్ని మీగడతో తయారు చేస్తారు.
దీనిని నోట్లో పెట్టుకోగానే వెంటనే కరిగిపోతుంది.ఇందులో ఆకర్షణీయంగా ఉండేందుకు నకిలీ కరెన్సీ నోట్లు పెడుతుంటారు.
ఈ రాయల్ డిష్ గురించి తెలియక సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం ప్రారంభించారు.అంబానీ ఇంట్లో టిష్యూపేపర్లుగా రూ.500ల నోట్లు వాడుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.తీరా అదొక డిష్ అని తెలిసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు.