టీడీపీ అధినేత ఈనెల 7వ తేదీన నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.నెల్లూరు జిల్లాలో అడ్డగోలు దోపిడీలు ఎక్కువ అయిపోయాయని విమర్శించారు.
జిల్లాలో అక్రమ లేఔట్లు వెలుస్తున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు.ఇరిగేషన్ శాఖలో రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ పనులు చేయడం లేదన్నారు.దోపడీదారులతో కుమ్మక్కై లంచాలకు అలవాటు పడ్డ అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.
ఇరిగేషన్, అక్రమ లేఔట్లు, సిలికలో హద్దుల్లేని అవినీతి జరుగుతుందని విమర్శించారు.