మైనర్ బాలిక కిడ్నాప్.. కట్ చేస్తే గోనె సంచిలో మృతదేహం లభ్యం..!

ఓ ఏడేళ్ల బాలిక అదృశ్యమై.పక్కింట్లో ఓ గోనె సంచిలో శవమై కనిపించి స్థానికంగా అందరినీ షాక్ కు గురిచేసింది.

 Kidnap Of A Minor Girl Kolkata Crime News, Police , Kidnap , Kolkata , Crime-TeluguStop.com

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా( Kolkata ) నగరంలోని శ్రీధర్ రాయ్ రోడ్ లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ ఏడేళ్ల బాలిక పై మిస్సింగ్ కేస్ నమోదయింది.అపార్ట్మెంట్లోని 32 ప్లాట్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

అయితే సీసీ టీవీని పరిశీలించగా బాలిక పక్కింట్లోకి వెళ్లడం కనిపించింది.పక్కింటిని క్షుణ్ణంగా పరిశీలించిన కూడా ఆ బాలిక ఆచూకీ తెలియలేదు.

బాలిక ఏమైందో, ఎక్కడికి వెళ్లిందో అర్థం కాక ఆ అపార్ట్మెంట్లో ఆందోళన నెలకొంది.ఆ అపార్ట్మెంట్లో ఓ ఇంటికి తాళం ఉండడంతో ఇరుగుపొరుగు వారికి కాస్త అనుమానం వచ్చి తెరిచి చూస్తే ఓ గోనెసంచిలో తప్పిపోయిన బాలిక( Minor girl ) శవమై కనిపించింది.

ఆ ప్లాట్ యజమాని అలోక్ కుమార్ కు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా బాలిక తల, చెవిపై తీవ్ర గాయాలు అయినట్లు నివేదిక వచ్చింది.

ఈ సంఘటనతో ఆ ప్రాంతంలోని ఇరుగుపొరుగువారు ఇది పోలీసుల( police ) నిర్లక్ష్యం వల్లనే జరిగిందని, పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి నిరసన తెలిపారు.పోలీసులు పరిస్థితులను అదుపు చేయలేక అదనపు బలగాలను రప్పించి పోలీస్ స్టేషన్ లోకి జనాలు రాకుండా గేటును మూసివేశారు.

ఈ సమాచారం తెలుసుకున్న కోల్కత్తా పోలీస్ సీనియర్ అధికారి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని, తగిన ఆధారాలు సేకరించి నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.ఇటువంటి నేరాలు చేసే వ్యక్తులను కఠినంగా శిక్షిస్తేనే సమాజంలో సామాన్యులు బతకగలుగుతారని స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube